Airport : ఎయిర్ పోర్ట్ లో గులాబ్ జామున్‌లు పంచాడు.. ఎందుకో తెలుసా?
NQ Staff - October 5, 2022 / 08:45 AM IST

Airport : విమాన ప్రయాణం చేసే సమయంలో కొన్ని సార్లు తీసుకు పోవాలనుకున్న లగేజ్ కి ఎయిర్పోర్ట్ అధికారులు అనుమతించారు. కొన్ని అనుమతి లేని వస్తువులను పదార్థాలను ఎయిర్పోర్టులోనే వదిలేయాల్సి ఉంటుంది లేదంటే తమతో వచ్చిన వారితో వెనక్కి ఆయన పంపించాల్సి ఉంటుంది.
తాజాగా పుకెట్ విమానాశ్రయంలో హిమాన్షు అనే వ్యక్తి గులాబ్ జామున్ డబ్బాలను పంచుతూ అందరిని ఆశ్చర్యపరిచాడు, అక్కడున్న సెక్యూరిటీ వారికి మాత్రమే కాకుండా ప్రయాణికులకు కూడా గులాబ్ జాములు ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇంతకు విషయం ఏమిటంటే విమాన ప్రయాణం చేసేందుకు పుకెట్ విమానాశ్రయానికి వెళ్లిన ఇండియన్ హిమాన్షుకి తన బ్యాగ్ లో ఉన్న గులాబ్ జామున్ డబ్బాలను తీసుకు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు అనుమతించ లేదు.
దాంతో వాటిని చెత్త బుట్టలో పడేయకుండా అక్కడే వదిలేయకుండా సమయం ఉండడంతో అక్కడున్నవారికి పంచాడు చాలా మంది ఇష్టంగా ఆ గులాబ్ జామున్ ను తిని హిమాన్షుకి థాంక్స్ చెప్పారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇలాంటి సమయంలో కాస్త తెలివిగా ఆలోచిస్తే నలుగురికి ఉపయోగపడేలా వ్యవహరించవచ్చు అంటూ హిమాన్షు భావించాడు. ఆయన ఆలోచించకుండా అక్కడే వదిలేస్తే గులాబ్ జామున్ రుచి అంత మందికి చూసే అవకాశం ఉండకపోయేది