Omicron BF7 : ‘ఒమిక్రాన్ బీఎఫ్ 7’.! కొత్త వేరియంట్ వస్తోందట.! అప్రమత్తంగా వుండాల్సిందే.!
NQ Staff - October 19, 2022 / 12:44 PM IST

Omicron BF7 : కోవిడ్ 19 కొత్త వేరియంట్ వస్తోందట. జర జాగ్రత్తగా వుండాలని భారత్ ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. పండగల సీజన్ కావడంతో ఈ వేరియంట్ బాగా స్ప్రెడ్ అయినట్లు నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌కి చెందిన ఈ కొత్త వేరియంట్ కారణంగా భారత్‌లో మరో కొత్త వేవ్ స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలున్నాయనీ ప్రజలు అప్రమత్తంగా వుండాలనీ సూచిస్తున్నారు.
కోవిడ్ కొత్త వేవ్.. తస్మాత్ జాగ్రత్త.! బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పని సరిగా ధరించాలనీ, వ్యక్తిగత పరిశుభ్రతను పాఠించాలని సూచిస్తున్నారు. అలాగే, వచ్చేది దీపావళి. చలికాలం కావడంతో, ఈ వేరియంట్‌కి మరింత బలం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇప్పటికే చైనాలో ఈ వేరియంట్ విజృంభిస్తోంది. అలాగే, మహారాష్ర్టలోనూ కొత్త వేరియంట్ కలకలం ఆల్రెడీ మొదలైంది.
దాంతో, ఇంతకు ముందు కన్నా, కాస్తంత ఎక్కువ జాగ్రత్తగా వుండాలని, నిర్లక్ష్యం వహించొద్దనీ వైద్యులు చెబుతున్నారు.
వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకమనీ చెబుతున్నారు. దాంతో, దీపావళి సెలవుల వేళ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.