Jr Ntr: సీఎం ఎన్టీఆర్ అంటూ కుప్పంలో నినాదాలు.. అస‌లు ఏం జ‌రుగుతుంది?

Jr Ntr:చంద్ర‌బాబు వ‌రుస ఓట‌ముల‌తో టీడీపీతో పాటు తెలుగు త‌మ్ముళ్ల‌లో అస‌హ‌నం మ‌రింత పెరుగుతూ పోతుంది. ఎన్టీఆర్ రాజ‌కీయాల‌లోకి రావాల‌నే డిమాండ్స్ వ్య‌క్తం అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో ఓ లేఖ అప్ప‌ట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీడీపీకి ఓటు వేయవద్దని.. ప్రతీకారం రుచి చూపిద్దాము అంటూ ఆ లేఖలో ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. మారింది.

ntr fans hungama at kuppam1
ntr fans hungama at kuppam1

తాజాగా కుప్పంలో ‘సీఎం ఎన్టీఆర్’ అంటూ హోరెత్తెలా నినాదాలు చేశారు. చంద్రబాబు ఇలాకాలో.. కుప్పం నడిబొడ్డున… వినిపించిన ఈ స్లోగన్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ‘జై ఎన్టీఆర్’..’CM ఎన్టీఆర్’..’బాబులకే బాబు తారక్‌బాబు’.. స్లోగన్లు ఆదివారం రోజున చిత్తూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చను లేవనెత్తాయి.

ఇటీవల వర్ల రామయ్య చేసిన కామెంట్స్ టీడీపీలో కొత్త కాకను రేపాయి. మేనత్త భువనేశ్వరిని దూషించిన వారిపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందన సరిగా లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తన స్నేహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలను నియంత్రించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్టయ్యారు. వర్ల రామయ్య నుంచి వచ్చిన ఆ సౌండ్‌కు..రీసౌండే తాజా కుప్పం ఎపిసోడ్.

ntr fans hungama at kuppam2
ntr fans hungama at kuppam2

చంద్ర‌బాబు స‌తీమ‌ణిపై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్‌పై నంద‌మూరి ఫ్యామిలీ అంతా స్పందించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ చాలా సాఫ్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇది టీడీపీ వాళ్ల‌కు నచ్చ‌లేదు. కొంద‌రు ఎన్టీఆర్‌ని దూషించ‌డంతో వారికి గ‌ట్టిగా పచ్ ఇచ్చే లా కుప్పంలో ఫ్యాన్స్ హంగామా సృష్టించారు.

ఫ్యాన్స్ వాళ్లంత వాళ్లుగా ఈ హంగామా చేశారా? దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఈ ఎపిసోడ్‌ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.