Bats: గ‌బ్బిలాల్లో క‌రోనా వైర‌స్‌..మ‌నుషుల‌కు సోకే ప్ర‌మాదం ఉందా?

Bats: ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న క‌రోనా మహ‌మ్మారి అనేక రూపాలు మార్చుకుంటూ ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తుంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా చాలా మంది ప్ర‌జ‌లు క‌రోనా దెబ్బ‌కు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. అయితే ఈ క‌రోనా మ‌హ‌మ్మారి పుట్టుక ఎలా జ‌రిగింది అనే దానిపై ఇంకా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. గ‌బ్బిలాల నుండి మ‌నుషుల‌కు సోకిందని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చిన వాటికి స‌రైన ఆధారాలు లేవు.

Novel coronavirus discovered in British bats
Novel coronavirus discovered in British bats

అయితే కోవిడ్ 19కు కార‌ణ‌మైన నావెల్ క‌రోనా వైర‌స్ ర‌కాన్ని బ్రిట‌న్ గ‌బ్బిలాల్లో శాస్త్ర‌వేత్తలు గుర్తించారు. క‌రోనా పుట్టుకు ఎలా జ‌రిగింద‌నే దానిపై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్న క్ర‌మంలొఓ యూనివ‌ర్సిటీఆఫ్ ఈస్ట్ ఆంగ్టియా, జువాలాజికల్ సొసైటీ ఆఫ్ లండ‌న్, ప‌బ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ సంస్థ‌లు సంయుక్తంగా ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టాయి. ఇందులోభాగంగా 50 గ‌బ్బిలాల మ‌ల సంబంధ‌మైన న‌మూనాల‌ని సేక‌రించి ప‌రిశోధ‌న చేశారు.

జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్ట‌గా ఒక న‌మూనాలో నావెల్ క‌రోనా వైర‌స్ మూలాలు ఉన్న‌ట్టు గుర్తించారు. దీనికి ఆర్‌హెచ్ జీబీ01 పేరు పెట్టారు.సార్స్‌కు సంబంధించిన వైర‌స్ గ‌బ్బిలాల‌ల్లో తొలి సారి వెలుగు చూసింద‌ని బ్రిట‌న్ గబ్బిలాల్లో కూడా ఇది క‌నిపించ‌డం తొలి సారి అని శాస్త్ర‌వేత్తలు అంటున్నారు. అయితే గ‌బ్బిలాల్లో సార్స్ సంబంధిత వైర‌స్‌లు ఉండ‌డం కొత్తేమి కాద‌ని నిపుణులు అంటున్నారు.

వేల సంవ‌త్స‌రాల నుండి వైర‌స్‌కు కేంద్ర‌కాలుగా గ‌బ్బిలాలు ఉన్నాయి. ఇప్పుడు ప‌రిశోధ‌న చేయ‌డం వ‌ల‌న గుర్తించ‌గ‌లిగాం. గ‌బ్బిలాల నుండి మాన‌వుల‌కు నేరుగా సోకే ప్ర‌మాదం లేదు. వైర‌స్ మ్యుటేష‌న్ చెందితే త‌ప్ప మాన‌వుల‌కు వ్యాప్తి చెందే ప్రమాదం లేద‌ని పేర్కొంది ప‌రిశోధ‌నా బృందం. కోవిడ్ సోకిన వ్య‌క్తి నుండి కరోనా గ‌బ్బిలాల‌కు వ్యాపిస్తే మ్యుటేష‌న్ జ‌రిగే ఆస్కారం ఉంటుంది. గ‌బ్బాలాల సంర‌క్ష‌కులు త‌ప్ప‌నిస‌రిగా పీపీఈ కిట్స్ ధరించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు.