Hyderabad : ట్రాఫిక్ అలర్ట్: హైద్రాబాద్‌లో ‘గీత’ దాటితే ఇకపై చలాన్ల వాతే.!

NQ Staff - September 30, 2022 / 10:24 PM IST

Hyderabad : ట్రాఫిక్ అలర్ట్: హైద్రాబాద్‌లో ‘గీత’ దాటితే ఇకపై చలాన్ల వాతే.!

Hyderabad : హైద్రాబాద్ ట్రాఫిక్ విభాగం ‘రోప్’ పేరుతో కొత్త క్యాంపెయిన్ షురూ చేసింది. ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలతో వాహనదారులకు చుక్కలు చూపించేయనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్టాప్ లైన్ దాటారో 100 ఫైన్ కట్టాల్సిందే. ఫ్రీ లెఫ్ట్‌కి ఆటంకం కలిగించారో ఏకంగా వెయ్యి రూపాయల జరీమానా పడిపోతుంది.

నడిచి వెళ్ళేవారికి ఇబ్బందిగా మారేలా వాహనాలు నిలిపారో 600 రూపాయల జరీమానా పడుతుంది. ఫుట్ పాత్ మీద వ్యాపారాలకీ జరీమానా తప్పదు. నిబంధనలు పాటించనివారికి జరీమానాలు విధిస్తామనీ, వాహనదారులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని పోలీస్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వాహనాలు పెరిగాయ్.. రోడ్లు మాత్రం అలాగే వున్నాయ్.!

రోడ్ల మీదకు వాహనాలు ప్రతి యేడాదీ పెద్ద సంఖ్యలో వస్తున్నాయ్. దానికి అనుగుణంగా రోడ్ల వెడల్పు పెరగడంలేదు. వాహనాల సంఖ్య పెరుగుతున్నకొద్దీ రోడ్ల మీద ట్రాఫిక్ సమస్యలు పెరుగుతూనే వుంటాయ్. ఈ క్రమంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కూడా పరిపాటిగా మారిపోతోంది.

ఆఫీసులకు ఆలస్యమైతే ఉద్యోగాలు పోతాయనో, ఇంకో కారణంతోనో.. నిబంధనల్ని అతిక్రమిస్తున్నారు చాలామంది వాహనదారులు.

ఏదిఏమైనా నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత. పైగా, ట్రాఫిక్ నిబంధనలంటే.. వాటిని పాటించడం వల్ల మన ప్రాణాలకూ, ఇతరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లకుండా వుంటుంది. సో, కష్టమైనాగానీ.. కాస్తంత జాగ్రత్తగా నిబంధనలు పాటించడమే మేలు. జరీమానా కట్టాలంటే జేబులు చిరిగిపోవడం కాదు.. పూర్తిగా గల్లంతైపోతాయ్ మరి.!

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us