Monkey : కోతులతో జర జాగ్రత్త.. పసికందుని బిల్డింగ్ పై నుండి కింద పడేసి ప్రాణం తీసిన వానరం
NQ Staff - July 18, 2022 / 11:35 AM IST

Monkey : ఈ మధ్య కాలంలో కోతులు జనావాసాల మధ్య ఎక్కువగా తిరుగుతూ హడలెత్తిస్తున్నాయి. అడవులు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె.. ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పే మాట ఇది. కానీ, వాస్తవ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. వానరాల గుంపు పల్లెటూర్ల పరిధి దాటి నగరాలు, పట్టణాలపై విరుచుకుపడుతోంది.

Monkey killed Baby From Top Building
కోతుల దాడి..
అటవీ ప్రాంతం నానాటికీ అంతరించిపోతుండటంతో వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. దీంతో జనావాసాలపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రమైంది. ఉత్తరప్రదేశ్‌లో ఒక కోతి ఏకంగా ఓ నాలుగు నెలల వయసుండే పసిబిడ్డను బిల్డింగ్ పైనుంచి కిందకు పడేసి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన యూపీలోని బరేలీ పట్టణ శివారు ప్రాంతంలో చోటుచేసుకున్నది.
ఈ ఘటనలో ఆ బాబు అక్కడికక్కడే మరణించాడు. బరేలీ శివారులోని దుంకా గ్రామానికి చెందిన నిద్రేష్ ఉపాధ్యాయ, ఆయన భార్య శుక్రవారం సాయంత్రం తమ నాలుగేండ్ల బాబును ఎత్తుకొని భవన పైఅంతస్తుపై వాకింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ కోతుల గుంపు బిల్డింగ్‌పైకి వచ్చింది. తరమించేందుకు ప్రయత్నించగా, అవి వారిని చుట్టుముట్టాయి.

Monkey killed Baby From Top Building
ఈ క్రమంలో కిందకు వెళ్లేందుకు మెట్ల వైపునకు వెళుతుండగా.. చేతుల్లో ఉన్న బిడ్డ కింద పడ్డాడు. దీంతో ఆ గుంపులోని ఓ కోతి వెంటనే ఆ బిడ్డను అమాంతం పట్టుకొని భవనంపై నుంచి కిందకు పడేసింది.దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన అందరిని కలిచి వేస్తుంది.