Middle School Students : కాలిఫోర్నియాలో మిడిల్ స్కూల్ విద్యార్థుల నోట ‘ఆర్ఆర్ఆర్’ పాట అదుర్స్.!

NQ Staff - September 25, 2022 / 09:50 PM IST

Middle School Students : కాలిఫోర్నియాలో మిడిల్ స్కూల్ విద్యార్థుల నోట ‘ఆర్ఆర్ఆర్’ పాట అదుర్స్.!

Middle School Students : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీయార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై రోజులు, నెలలు గడుస్తున్నా సినిమా ప్రభంజనం ఏదో రూపంలో ఇంకా కనిపిస్తూనే వుంది.

తాజాగా, అమెరికాలో ఓ స్కూల్ ఈవెంట్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని పాటను ఆలపించారు. అది కూడా తెలుగులో కావడం గమనార్హం. కాలిఫోర్నియాలోని మిడిల్ స్కూల్ స్టూడెంట్స్ ఈ పాటని పెర్‌ఫెక్ట్‌గా ఆలపించారు.

ఆ ఉత్సాహమే వేరప్పా..

దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల ఫ్లాష్ మాబ్స్‌లో ఎక్కువగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటను ఆలపిస్తున్న సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాలోని మిడిల్ స్కూల్ విద్యార్థులు కూడా అదే పాటని తమదైన స్టయిల్లో పాడి అలరించారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్.. ఈ ఇద్దరూ పోటీ పడి ఈ పాటకు డాన్సులేశారు. డాన్సుల్లో ఇద్దరూ ఒకర్ని మించి ఇంకొకరని ఇప్పటికే పలు సినిమాలతో విడివిడిగా ప్రూవ్ చేసుకున్నా.. ఈ పాటతో మరింత స్పష్టతనిచ్చేశారు.

కాగా, ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా సగటు సినీ ప్రేక్షకుల్ని ఓటీటీ వేదికగా ఇంకా అలరిస్తూనే వున్న విషయం విదితమే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఆస్కార్ బరిలోకి పంపాలని రాజమౌళి అండ్ టీమ్ ప్రయత్నిస్తోంది.

 

 

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us