MBBS Student Swathi Reddy : ట్రైన్‌లోనే పాప డెలివరీ: పాప తల సగం బయటికి వచ్చేసింది.! కానీ.!

NQ Staff - September 15, 2022 / 06:08 PM IST

158763MBBS Student Swathi Reddy : ట్రైన్‌లోనే పాప డెలివరీ: పాప తల సగం బయటికి వచ్చేసింది.! కానీ.!

MBBS Student Swathi Reddy : స్వాతిరెడ్డి అనే మెడికో ట్రైన్‌లోనే ఓ మహిళకు డెలివరీ చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ గర్భిణీ ఏసీ కంపార్ట్‌మెంట్‌లో జర్నీ చేస్తోంది. విజయవాడ నుంచి వైజాగ్ వెళుతున్న దురంతో ఎక్స్‌ప్రెస్ అది. అనుకోకుండా నొప్పులు రావడంతో, అదే కంపార్ట్‌మెంట్‌లో వున్న మరో మహిళను నిద్ర లేపి సాయం కోరగా అదృష్టవశాత్తూ ఆమె డాక్టర్ అని తెలిసింది.

ఎలాంటి సదుపాయాల్లేకుండా..

MBBS Student Swathi Reddy Exclusive Interview

MBBS Student Swathi Reddy Exclusive Interview

స్వాతి రెడ్డి అనే హౌస్ సర్జన్. సడెన్‌గా ఆమె వద్దకు ఓ వ్యక్తి వచ్చి మా భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయ్ ప్లీజ్ సాయం చేయండి అనగా, ఆ ప్రెగ్నెంట్ లేడీ వద్దకు వెళ్లిన డాక్టర్ స్వాతి, అప్పటికే బిడ్డ తల సగం వరకూ బయటికి వచ్చేసిందని తెలిపారు.

స్వాతిరెడ్డి సూచనల మేరకు ఆ గర్భిణీ మూడు నిమిషాల్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు డెలివరీ అయితే అయ్యింది కానీ, ఆ తర్వాత మాయ బయటికి రావడానికి చాలా టైమ్ పట్టిందట. 45 నిముషాల స్ర్టగుల్ తర్వాత ఆ ప్రెగ్నెంట్ లేడీ మాయని వదిలిపెట్టిందట.

బొడ్డు పేగును కట్ చేసేందుకు కూడా అక్కడ ఎలాంటి కత్తెర వంటి పని ముట్లు లేకపోవడంతో, డాక్టర్ స్వాతి చాకచక్యంగా మాయతో బిడ్డ బొడ్డు పేగును ముడి పెట్టి కట్టి పెట్టేశారట. ఏసీ కంపార్ట్‌మెంట్ కావడంతో చుట్టూ చలిగా వున్నందున బేబీకి తగిన వెచ్చదనాన్ని అందించేందుకు రైలు సిబ్బంది సాయం తీసుకున్నారట. బెడ్ షీట్లు వంటివి అందించడంతో బేబీ ఆరోగ్యంగా వుందని స్వాతి రెడ్డి చెప్పారు. ఆ తర్వాత తల్లినీ బిడ్డనీ ఆసుప్రతికి తరలించారు.

డాక్టర్ అయినా ఎలాంటి సదుపాయాల్లేకుండా ఇలాంటి పెద్ద సాహసం చేసినందుకు చాలా టెన్షన్ ఫీలయ్యాననీ డెలివరీ తర్వాత తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా వుండడంతో ఆ టెన్షన్ తొలిగిపోయిందని స్వాతి రెడ్డి చెప్పారు. స్వాతిరెడ్డిని ప్రశంసిస్తూ నెటిజన్లు ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్‌గా చేస్తున్నారు.