Sleep: ఇత‌డు ఏడాదిలో 60 రోజులు మాత్ర‌మే మేల్కొని ఉంటాడు..!

Sleep: కొందరు మ‌నుషుల‌కి సంబంధించిన వార్త‌లు మ‌న‌ల్ని ఎంత‌గా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. కొంద‌రు ఆహారంగా గ్లాసులు, సుద్ద‌లు, మొక్క‌లు తింటార‌ని, ఇంకొంద‌రు నిద్రే పోర‌ని ఇలాంటి వార్త‌లు మ‌న దృష్టికి వ‌స్తూనే ఉంటాయి. తాజాగా ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గా, ఆ వార్త సారాంశం ఏంటంటే ఓ వ్య‌క్తి ఏడాదిలో 300 రోజులు నిద్ర‌పోతూనే ఉంటాడ‌ట‌. కేవ‌లం 60 రోజుటు మాత్ర‌మే మేల్కొని ఉంటాడ‌ట‌.

Man Sleep for 300 Days in a Year
Man Sleep for 300 Days in a Year

రామాయ‌ణంలో రావ‌ణుడి సోద‌రుడు కుంభ‌క‌ర్ణుడు ఏడాదిలో ఆరు నెల‌లు నిద్ర‌లోనే ఉంటాడు. ఇప్పుడు ఆయ‌న‌ని మించిపోయాడు రాజస్థాన్‌‌లోని నగౌర్‌కు చెందిన పుర్కారామ్. అతడిని అంతా ‘కుంభకర్ణుడు’ అని పిలుస్తుంటారు. వయస్సు 42 ఏళ్లు. భద్వా గ్రామంలో నివసిస్తున్నాడు. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తారు. కానీ పుర్కారామ్ ఒక్కసారి నిద్రపోతే 25 రోజుల వరకు మేలుకోడు. గత 23 ఏళ్ల నుంచి అతడి జీవితంలో నిద్రతోనే గడిచిపోయింది.

పుర్కారామ్‌కి యాక్సిస్ హైపర్సోమ్నియా’ అనే అరుదైన వ్యాధి ఉంది. కుటుంబ పోష‌ణ కోసం ఒక దుకాణం న‌డిపిస్తున్నాడు. అయితే అతనికి ఉన్న నిద్ర స‌మ‌స్య వ‌ల‌న నెల‌లో కేవ‌లం ఐదు రోజులు మాత్ర‌మే ఆ షాపు తెర‌చి ఉంటుంది. అత‌డు నెల‌లో 5 రోజులు ప‌ని చేసి మిగ‌తా రోజులు నిద్ర‌లోకి జారుకుంటాడు. ఓ సారి నిద్ర‌లోకి వెళ్లాడంటే అత‌నిని లేప‌డం బ్ర‌హ్మ‌త‌రం వ‌ల్ల కూడా కాదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పుర్కారామ్ కుటుంబికులు అతడి వైద్యం అందించలేకపోతున్నారు. పెద్ద మనసుతో ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నారు.

పుర్కార‌మ్ గ‌తంలో 15 గంట‌లు ప‌డుకునేవాడు. వ్యాధి ముదురుతున్న కొద్ది ప‌డుకునే గంట‌లు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు నెల‌లో 20 నుండి 25 రోజులు నిద్ర‌లోనే ఉంటాడు. ప‌డుకున్న‌ప్పుడే స్నానం చేయించ‌డం, ఆహారం తినిపించ‌డం చేస్తున్నాం. ఒక్కోసారి పని చేస్తూనే నిద్ర‌లోకి జారుకుంటాడు. లేవగానే త‌ల‌నొప్పి అంటాడు. శ‌రీరానికి వ్యాయామం లేక‌పోవ‌డం,ఇత‌ర‌త్రా ఆరోగ్యం స‌మ‌స్య‌ల వ‌ల‌న పుర్కారామ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అతడి భార్య లక్ష్మీ దేవి తెలిపారు.