Koti Deepotsavam : 31 నుంచి ‘కోటి దీపోత్సవం’

NQ Staff - October 10, 2022 / 01:36 PM IST

Koti Deepotsavam : 31 నుంచి ‘కోటి దీపోత్సవం’

Koti Deepotsavam : కార్తీక మాసం లో ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే ‘కోటి దీపోత్సవం‘ కి మంచి పేరు దక్కింది. 2012లో నరేంద్ర చౌదరి సంకల్పంతో ఈ దీపోత్సవానికి అంకురార్పణ జరిగింది. తొలిసారిగా 2012లో లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ మహా దీపయజ్జం.. మరుసటి ఏడాది నుంచే కోటిదీపోత్సవంగా మారింది. క్రమంగా ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది.

ప్రతీ ఏడాది నిరాటంకంగా కొనసాగుతోంది. కోటిదీపోత్సవ వేదిక ముస్తాబవుతోంది. ఈ వేదికగా మహా దేవునికి ప్రీతికరమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజలు ఎన్నో భక్తుల మనసులను భక్తిపారశ్యంతో ముంచేస్తాయి.

ఈ ఏడాది అక్టోబర్‌ 31వ తేదీతో ఆరంభమై.. నవంబర్‌ 14వ తేదీ వరకు కొనసాగనుంది కోటిదీపోత్సవం. దీపాల ఉత్సవానికి అంకురార్పణ జరిగి పదేళ్లు అవుతుతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్‌ 31వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కోటి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది ఎన్టీవీ భక్తి టీవీ యాజమాన్యం.

ఈనెల 31వ తేదీ నుంచి ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియం లో ఈ ఉత్సవం 15 రోజుల పాటు కొనసాగనుంది. భక్తుల కోసం ఎన్టీవీ చేపట్టిన ఈ మహాయజ్ఞానికి చాలా ప్రత్యేకత ఉంది. ఒకే వేదికపై దేవీదేవతల కల్యాణాలు జరిపిస్తోంది.

దీపారాధన ముగిసిన వెంటనే లిగోద్భవ దృశ్యాన్ని ఆవిష్కిస్తారు.. లింగాష్టకం నేపథ్యంలో లిగోద్భవం ఒక మహోత్సవంగా జరుగుతుంది.. కల్యాణ మూర్తలులందరికీ ప్రతిరోజూ వాహనసేవ. కోలాట బృందాలు ముందు నడుస్తుండగా.. ఆ ఉత్సవ మూర్తులు.. ప్రజల దగ్గరకు తరలివస్తారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us