Kerala Woman : హ్యాట్సాఫ్.. కుమారుడి కోసం తాను చదివి ప్రభుత్వ ఉద్యోగం కొట్టిన మహిళ
NQ Staff - August 9, 2022 / 01:56 PM IST

Kerala Woman : ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం అనేది అందని ద్రాక్షగా మారింది. ఎంతో కష్టపడితే కాని ఆ అదృష్టం దక్కడం లేదు. ఇప్పటికీ చాలా మంది రేయింబవళ్లు ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే ఆ ఆనందం వేరే లెవల్‌లో ఉంటుంది. అలాంటి తల్లి, కొడుకులకి వస్తే ఇంకెలా ఉంటుంది.

Kerala Woman son to Join government service together
డబుల్ బొనాంజా..
కేరళకు చెందిన మహిళ.. అంగన్ వాడీ టీచర్ గా పనిచేసేది.. కుమారుడిని బాగా చదివించాలన్నది ఆమె ఉద్దేశం. అందుకే కుమారుడికి పాఠాలు బాగా అర్థం చేయించేందుకు తానూ పుస్తకాలు చదివింది. ఆమెకూ సబ్జెక్టులన్నింటి మీదా పట్టు వచ్చింది. ఇటీవల ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో కుమారుడితోపాటు ఆమెకూ ప్రభుత్వ ఉద్యోగం రావడం గమనార్హం. ఇదంతా 42 ఏళ్ల బిందు అనే మహిళ విజయగాథ.
బిందు తన కుమారుడు 10వ తరగతి చదువుతున్న సమయంలో అతడిని ప్రోత్సహించేందుకు పుస్తకాలు చదవటం ప్రారంభించారు. అదే ఆమెను కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్‌సీ) పరీక్షలవైపు మళ్లించింది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడితో పాటు ఉద్యోగం సాధించారు. 42 ఏళ్ల బిందు.. లాస్ట్ గ్రేడ్ సర్వెంట్(ఎల్‌జీఎస్) పరీక్షలో 92వ ర్యాంకు సాధించారు. 24 ఏళ్ల ఆమె కుమారుడు లోవర్ డివిజనల్ క్లర్క్(ఎల్‌డీసీ) పరీక్షలో 38వ ర్యాంక్ సాధించాడు. ఈ విషయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు బిందు.
ఇద్దరికీ ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు ఖాయం కావడంతో వారి కుటుంబంలో ఆనందానికి అంతే లేకుండా పోయింది. చిత్రం ఏమిటంటే.. కుమారుడి కోసం తాను పుస్తకాలు పట్టినా.. తన కుమారుడు, కోచింగ్ సెంటర్ లోని ఫ్యాకల్టీనే తన విజయానికి కారణమని బిందు చెబుతుండడం గమనార్హం. అయితే.. తన లక్ష‍్యం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పరీక్ష అని… ఎల్‌జీఎస్ బోనస్ అని పేర్కొన్నారు బిందు. గత 10 ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.