Kerala Auto Driver : లాటరీలో 25 కోట్లు గెలిచాడు.! కష్టాలు కొనితెచ్చుకున్నాడు.!
NQ Staff - September 25, 2022 / 07:22 PM IST

Kerala Auto Driver : కేరళకు చెందిన ఓ వ్యక్తికి అనూహ్యంగా లాటరీ తగ్గింది. లక్షల్లో కాదు, కోట్లల్లో తగిలింది లక్కీ లాటరీ. ఆ మొత్తం ఎంతో తెలుసా.? ఏకంగా 25 కోట్లు. ఇంత సొమ్ము వస్తే ఎవరైనా ఏం చేస్తారు.? ఎగిరి గంతేస్తారు. కానీ, ఆ లక్కీ లాటరీ విజేత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా వుంది.
లాటరీలో ఎంత గెలిస్తే అంత మొత్తమూ ఇచ్చేయరు కదా.? పన్నులు పోతాయ్. సుమారుగా 10 కోట్ల వరకూ పన్నుల రూపంలో ఔట్ అయిపోతాయి. మిగిలిన 15 కోట్లు చేతికి వస్తాయ్. అయినా సరే, అదీ చిన్న మొత్తమేమీ కాదని నక్క తోక తొక్కిన అనూప్‌కి కూడా తెలుసు. అతనొక ఆటోడ్రైవర్.
బాబోయ్ నాకొద్దీ లాటరీ..
అనూప్ లక్కీ లాటరీ సొంతం చేసుకున్నాడని తెలిశాక, అతని బంధువుల నుంచి ఫోన్ కాల్స్ ఎక్కువైపోయాయ్. ‘మాకు సాయం చేస్తావా.? చెయ్యవా.?’ అంటూ వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టారట. దాంతో, క్షణాల్లో అతని ఆనందం ఆవిరైపోయిందట.
‘డబ్బు వచ్చిందని సంతోషించాలా.? ఇన్నాళ్ళూ దూరం పెట్టిన బంధువులు ఇప్పుడు నన్ను వేధిస్తున్నందుకు ఆనంద పడాలా.? ఏం చేయాలి.?’ అంటూ అనూప్ వాపోతున్నాడు. మామూలుగా అయితే, బంధువుల్ని ఇలాంటి సందర్భాల్లో ఎవరూ పట్టించుకోరు. సున్నిత మనస్కుడు కదా.. అందుకే, ఇలా బాధపడుతున్నాడు.
అన్నట్టు, తగిలిన లాటరీ వల్ల బంధువుల్లోనే తనకు శతృవులు పెరిగిపోయారనీ, వారి వల్ల తనకు ప్రాణాపాయం కూడా వుండొచ్చని కన్నీరుమున్నీరవుతున్నాడు అనూప్.