Venkatesh lyer: జాక్ పాట్.. కుర్ర క్రికెట‌ర్‌కి అప్పుడు 20 లక్షలు..ఇప్పుడు 8 కోట్లు..

Venkatesh lyer: ఐపీఎల్ కుర్ర క్రికెట‌ర్స్‌కి అదృష్టంగా మారింది. ఇందులో రాణిస్తే డైరెక్ట్‌గా భార‌త జ‌ట్టులో ఆడే ఛాన్స్ ద‌క్కుతుంది.రీసెంట్‌గా జ‌రిగిన ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన కొంద‌రు క్రికెట‌ర్స్ ఇటీవ‌ల న్యూజిలాండ్ టీ 20 సిరీస్‌లో అవ‌కాశం అందిపుచ్చుకున్నారు. అందులో వెంక‌టేష్ అయ్య‌ర్ ఒక‌డు.

Venkatesh lyer
Venkatesh lyer

టీమిండియా ఆటగాడు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న వెంకటేష్‌ అయ్యర్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. గత వేలంలో కేవలం రూ.20లక్షలకే ఈ స్టార్‌ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్‌ ఫ్రాంఛైజీ ఈసారి ఏకంగా రూ.8 కోట్లు పెట్టి అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్‌-2021లో భాగంగా దుబాయి వేదికగా జరిగిన రెండో దశ పోటీల్లో అంచనాలకు మించి రాణించాడు వెంకటేష్‌.

మొత్తం10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు సాధించి జట్టును ఫైనల్‌ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రతిభతోనే టీమిండియాలో కూడా స్థానం సంపాదించాడు. అందుకే అతడిని రిటైన్‌ చేసుకునేందుకు కేకేఆర్‌ ఫ్రాంఛైజీ.. ఏకంగా 8 కోట్లు ఖర్చు చేసింది. దీంతో వెంకటేశ్‌ అయ్యర్‌ సాలరీ దాదాపు 40 రెట్లు(4000%) పెరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ అయ్యర్‌ గనుక వేలంలోకి వస్తే రికార్డులు బద్దలయ్యేవి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కాగా వెంకటేశ్‌ ఇటీవలి న్యూజిలాండ్‌ సిరీస్‌తో టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను ఆల్‌రౌండర్‌ను అని, జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఏ స్థానంలో ఆడేందు​కైనా సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చాడు.

jak part for venkatesh lyer1
jak part for venkatesh lyer1

కాగా మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ 2020 రిటెన్షన్‌ ప్రక్రియలో అయ్యర్‌తో పాటు వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు), మిస్టరీ స్పి్న్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (రూ. 8 కోట్లు), విండీస్‌ స్పి్న్నర్‌ సునీల్‌ నరైన్‌ (రూ. 6 కోట్లు)ను రిటైన్‌ చేసుకుంది. వీరి నలుగురి కోసమే ఏకంగా 42 కోట్లు ఖర్చు చేసింది కేకేఆర్‌ ఫ్రాంఛైజీ.