National Emblem : జాతీయ చిహ్నంలో సింహం ఎలా వుండాలి.?

NQ Staff - July 13, 2022 / 09:02 PM IST

National Emblem : జాతీయ చిహ్నంలో సింహం ఎలా వుండాలి.?

National Emblem : రాజముద్ర అనండీ, జాతీయ చిహ్న అనండీ.. కనిపించే మూడు సింహాలకు తోడు కనిపించకుండా వెనకాల వుండే మరో సింహం.. వెరసి, మొత్తంగా నాలుగు సింహాలు.. వాటితోపాటు అశోక చక్రం.. సత్యమేవ జయతే అని రాసి వుండే.. ఓ గుర్తు.. ఇది మన ఆత్మగౌరవం.!

Indian National Emblem controversy latest

Indian National Emblem controversy latest

పార్లమెంటు కొత్త భవనానికి సంబంధించిన నిర్మాణాల్లో జాతీయ చిహ్నాన్ని కూడా వుంచారు. దీన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. దాంతో, వివాదం షురూ అయ్యింది. జాతీయ చిహ్నాన్ని ప్రధాని ఆవిష్కరిస్తే అందులో వివాదం ఏముంది.?

వివాదం అందుకే.!

చిహ్నంలో సింహాలు కనిపిస్తున్నా.. ఆ సింహాలు ప్రశాంతంగా వుంటాయి. రాజసం వాటిల్లో ఉట్టిపడుతుంది. తాజాగా, రూపొందించిన చిహ్నంలో మాత్రం, సింహాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. పాత చిహ్నంలోనివి పనికిమాలిన సింహాలు.. ఇప్పుడు గర్జించే సింహాలు.. అంటూ ‘కమలదళం’ కొత్త అర్థాన్ని తీసుకొచ్చింది.

అదే, అన్ని వివాదాలకూ కారణమవుతోంది. అసలంటూ చిహ్నాన్ని ఎలా మార్చుతారు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. తమ ప్రత్యేకతను చాటుకోవడానికి మోడీ సర్కారు ఇలాంటి వివాదాల్ని కావాలనే రాజేస్తున్నట్లు కనిపిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

మూడు సింహాలతో కూడిన చిహ్నం (కనిపించని నాలుగో సింహంతో సహా) మన ఆత్మగౌరవానికి

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us