Ind vs SA : ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా : మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ లోకి అనుకోని అతిథి
NQ Staff - October 2, 2022 / 07:55 PM IST

Ind vs SA : భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ గువహటి వేదికగా జరుగుతుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1 – 0 ఆదిత్యంలో ఉంది.
ఈ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగబోతుంది, మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుండగా గ్రౌండ్ లోకి పాము వచ్చింది. భారత్ ఏడవ ఓవర్ బ్యాటింగ్ చేస్తూ ఉండగా మైదానంలో ఆటగాళ్లు పామును చూసి ఒక్క సారిగా షాక్ గురయ్యారు.
వెంటనే గ్రౌండ్ సిబ్బంది వచ్చి పాముని పట్టుకొని వెళ్లి పోయారు. ఆ తర్వాత ఆట యధవిధిగా సాగుతుంది. పాము గ్రౌండ్ లోకి రావడంతో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతుంది. అంతే కాకుండా ప్రేక్షకుల యొక్క భద్రత విషయంలో కూడా స్టేడియం అధికారుల యొక్క బాధ్యతరాహిత్యం కనిపిస్తుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ప్రస్తుతం గ్రౌండ్ లోకి పాము రావడం పట్ల పలు రకాలుగా చర్చ జరుగుతుంది. టీమ్ ఇండియా తరఫున పాము బ్యాటింగ్ చేసేందుకు వచ్చిందంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.. మరికొందరు మ్యాచ్ చూసేందుకు పాము వచ్చిందని సరదాగా కామెంట్ చేస్తున్నారు.
ఏది ఏమైనా ఈ విషయం కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ముందు ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
Play stopped due Snake on the Cricket Field..#Cricket#Assam#T20 pic.twitter.com/gxMEheOTkI
— मुंबई Matters™✳️ (@mumbaimatterz) October 2, 2022