Ind Vs Eng: టీమిండియాలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. వాయిదా ప‌డ్డ ఐదో టెస్ట్ మ్యాచ్

Ind vs Eng: నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు కోచ్ రవిశాస్త్రి లండన్‌లో ఓ పుస్తక ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. ఆ కార్య‌క్ర‌మం నుండి వ‌చ్చాక ర‌విశాస్త్రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అతనితో క్లోజ్‌గా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌కి ఆ త‌ర్వాత కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. ఈ ముగ్గురూ 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండ‌నున్నారు.

IND Vs Eng 5th Test Match Called Off
IND Vs Eng 5th Test Match Called Off

ఇక గురువారం టీమిండియా పిజియోథెరపిస్ట్‌ యోగేశ్‌ పర్మార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అతనితో పాటు శిక్షణ సిబ్బందిలో మరికొందరు కరోనా బారిన పడడంతో మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఈసీబీ తెలిపింది. ఆట‌గాళ్లు అంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఫ‌లితాలు వ‌చ్చాక మ్యాచ్‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఈసీబీ వెల్ల‌డించింది. అన్ని ఫలితాలు వచ్చే వరకు మ్యాచ్‌ను రెండు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఈసీబీ స్పష్టం చేసింది.

ఈ సిరీస్‌లో కోహ్లీసేన ఇప్పటికే 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టులోనూ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆరాటపడుతోంది. మరోవైపు, ఈ మ్యాచులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలన్న కసితో ఇంగ్లండ్‌ టీం కోరుకుంటోంది. చివరి టెస్టులో ఎవరు గెలుస్తారో చూడాలి. అయితే, ఐదో టెస్టుకు ముందు టీమిండియాలో కరోనా కలకలం రేగింది.

ఫిజియోకి కరోనా సోకడంతో ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసుకున్న భారత ఆటగాళ్లు హోటల్‌ గదులకే పరిమితమయ్యారు. అయితే, టీమిండియాలోని ఆటగాళ్లందరికీ కోవిడ్ పరీక్షలు చేయగా, నెగిటివ్ రావడంతో చివరి టెస్టుకు ఆటంకాలు తొలిగింద‌ని అనుకున్నారు. కాని మ్యాచ్‌ని ర‌ద్దు చేసి షాకిచ్చారు. ఒకవేళ చివరి టెస్టు మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంటుంది.