Tamilanadu : భర్త మంచాన పడడంతో భార్య అక్రమ సంబంధం.. విషయం తెలిసిన మామ ఏం చేశాడో తెలుసా!
NQ Staff - September 28, 2022 / 08:11 AM IST

Tamilanadu : తమిళనాడు లోని తేన్ కాశి జిల్లాలో దారుణం జరిగింది. స్థానిక లాలగుడి ఇరువు గ్రామంలో నివాసం ఉంటున్న ఇసాకి రాజ్ అనే వ్యక్తి కి కొన్నాళ్ల క్రితం పెళ్లి జరిగింది. దాంపత్య జీవితం అంతా సాఫీగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో ఈసాకి రాజ్ తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యాడు. దాంతో భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తి విడాకులు తీసుకున్నారు.
కొన్నాళ్ల తర్వాత ఇసాకి రాజ్ పద్మావతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పద్మావతిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈసారి మరింత ఎక్కువగా అనారోగ్య సమస్యలు రావడంతో పూర్తిగా మంచానికి పరిమితం అయ్యాడు. అదే అదునుగా పద్మావతి తాను జాబ్ చేసే ప్లేస్ లో ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది.
భర్త ఆర్థికంగా సంపాదించలేకపోతున్నాడు, అలాగే సంతృప్తి పరచలేక పోతున్నాడు. అందుకే తాను వర్క్ ప్లేస్ లో మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్లుగా సన్నిహితుల వద్ద పద్మావతి చెప్పేది. ఆ విషయం ఆ నోట ఈ నోట పడి ఇసాకి రాజ్ యొక్క తండ్రి చెవిన పడింది. పరువు పోగొట్టే పనులు చేయవద్దంటూ పద్మావతికి మామ పదే పదే విజ్ఞప్తి చేశాడు.
అయినా కూడా పద్మావతి మామ మాట వినలేదు. దాంతో పద్మావతిని చంపాలని భావించాడు. ఒక రోజు ప్రియుడుతో గడిపి వచ్చిన సమయంలో ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో ఇదరూ కూడా ఒకరిని ఒకరు దూషించుకున్నారు. దాంతో పద్మావతి పై మామకు మరింతగా కోపం పెరిగింది.
ఒకరోజు ప్రియుడుతో ఆమె కలిసి ఉన్న సమయంలో ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ప్రియుడుతో ఉన్న సమయంలోనే పద్మావతిని హత్య చేసి పోలీసుల ఎదుట లొంగి పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం సంఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది, అక్రమ సంబంధాలు హత్యలకు దారి తీస్తాయని అనేందుకు ఇది మరో ఉదాహరణ.