Ants : భూమి మీద వున్న చీమల సంఖ్య ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

NQ Staff - September 21, 2022 / 12:05 AM IST

159792Ants : భూమి మీద వున్న చీమల సంఖ్య ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

Ants : ఈ భూగోళంపై చీమలు ఎక్కువగా వున్నాయా.? మనుషులు ఎక్కువగా వున్నారా.? అంటే ఎలా లెక్కకట్టగలరు.? కానీ, కొందరు లెక్కకట్టేశారు. మనుషుల కన్నా చీమలే ఎక్కువ వున్నాయని ఓ అంచనా ప్రకారం చెప్పేశారు.

If you know the number of ants on earth you will be shocked

If you know the number of ants on earth you will be shocked

ఎప్పటి నుంచో చీమల సంఖ్యను కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే వున్నారు. కానీ, ఖచ్చితంగా కనిపెట్టలేకపోయారు. తాజాగా హాంకాంగ్‌కి చెందిన కొందరు పరిశోధకులు ఈ సాహసానికి పూనుకున్నారు. చీమల సంఖ్యను లెక్కగట్టే ప్రయత్నం చేశారు. ఏకంగా 489 అధ్యయనాల అనంతరం ఓ అంచనాకి వచ్చారు.

భూమిపై దాదాపు 20, క్వాడ్రిలియన్ల చీమలున్నాయని లెక్కగట్టారు. ఆ సంఖ్య ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అక్షరాలా 20,000,000,000,000,000.. ఇది అన్నమాట. ఈ లెక్కను పలకడానికే నోరు తిరగనంత. ఇది కూడా కేవలం అంచనా మాత్రమే. ఖచ్చితమైన లెక్కగా వారు పేర్కొనలేదు.

నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్స్‌లో ఈ పరిశోధనలు ప్రింట్ చేయబడ్డాయి. సర్వాంతర్యామి శివుడిలాగా, చీమలు కూడా సర్వవ్యాప్తి చెందడం వల్ల చాలా మంది ప్రకృతి పరిశోధకులు చీమల ఖచ్చితమైన సంఖ్యను చెప్పలేకపోతున్నారు.

అంతేకాదు, ఈ సంస్థ చీమల బయోమాస్‌ని కూడా గుర్తించింది. ఈ భూగోళం మొత్తమ్మీద చీమల బయోమాస్ 12 మిలియన్ టన్నులుగా పేర్కొంది. ఒక ప్రాంతం లేదా, వాల్యూమ్‌లోని జీవుల మొత్తం పరిమాణం లేదా బరువును సూచించచడాన్ని బయోమాస్ అంటారు.