Hyderabad Police : హైద్రాబాద్ పోలీస్.! సౌండ్ పొల్యూషన్ ఇలా తగ్గించండి ప్లీజ్.!

NQ Staff - October 7, 2022 / 10:23 AM IST

Hyderabad Police : హైద్రాబాద్ పోలీస్.! సౌండ్ పొల్యూషన్ ఇలా తగ్గించండి ప్లీజ్.!

Hyderabad Police : వినాయక నిమజ్జనం, ఇతరత్రా సెలబ్రేషన్స్ నేపథ్యంలో బూరలు ఊదుతూ కుర్రకారు సందడి చేయడం తెలిసిన సంగతే. అవును నిజమే, ఆ సౌండ్ లేకుంటే, సందడి వుండదు. కానీ, విచ్చల విడిగా చేస్తున్న ఆ సౌండ్ వల్ల ఎంత పొల్యూషన్ వస్తుందో కదా. అదేనండీ సౌండ్ పొల్యూషన్.

అందుకే బీహార్‌ పోలీసులు అలా విచ్చలవిడిగా సౌండ్ పొల్యూషన్‌కి కారణమవుతున్న కొందరు కుర్రోళ్లకు పనిష్మెంట్ ఇచ్చారు. అదే బూరలతో కుర్రకారు చెవిలో ఊది చూపించి, ఆ పెయిన్ ఫీలయ్యేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సౌండ్ పొల్యూషనే కానీ, సందడి మాటేంటి చెప్మా.!

ఈ వైరల్ వీడియో చూసి, హైద్రాబాద్ పోలీసులు కూడా ఇలాంటి తరహా పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది.. అని కొందరు నెటిజన్లు సూచనలిస్తున్నారు. అయితే, అలా చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు అంటున్నారు. ఇలా ఈ బూరల సందడిపై భిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.

కొందరు సమర్ధిస్తుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సౌండ్ పొల్యూషన్ నేపథ్యంలో పోలీసులు స్థానికుల్లో అవగాహన కల్పించడం వరకూ ఫర్వాలేదు కానీ, ఆ బూరల శబ్ధాన్ని డైరెక్టుగా చెవిలో ఊదడం ద్వారా, అవగాహన కల్పించడం అనేది ఎంతవరకూ సబబు.? అనేది వ్యతిరేకిస్తున్న వారి సూటి ప్రశ్న.

నాణానికి రెండు వైపులా.. అన్నట్లుగా సెలబ్రేషన్స్‌లోనూ ఒకింత మంచి, ఒకింత చెడూ.. రెండూ వుంటాయ్. అయితే, హద్దులు దాటనంత వరకూ అన్నీ బాగానే వుంటాయ్. దాటితేనే, అనర్ధాలు జరుగుతాయ్. ఆ ఒక్కటీ గమనిస్తేనే సెలబ్రేషన్ అనేది సేఫ్‌గా వుంటుంది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us