Hug: హగ్ చేసుకోండి.. 7300 రూపాయలు చెల్లించండి అంటున్న మహిళ

Samsthi 2210 - June 17, 2021 / 12:58 PM IST

Hug: హగ్ చేసుకోండి.. 7300 రూపాయలు చెల్లించండి అంటున్న మహిళ

Hug: జంతర్ మంతర్ చూమంతర్ ఖాళీ ..అందర్ దరత్ దెబ్బకు ఖాళీ.. ఈ డైలాగ్ గుర్తుందా ? శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో బాధలో ఉన్న వాళ్ళకు ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుని మెగాస్టార్ చిరంజీవి ఈ డైలాగ్ చెప్తాడు. మనం బాధలో ఉన్నా, ఏడుస్తున్నా, ఒత్తిడిలో ఉన్నా, ప్రేమతో, ఆప్యాయతగా దగ్గరకు తీసుకుంటే అదొక ఓదార్పులా అనిపిస్తుంది. హగ్ చేసుకుని ఓదార్పుతో నాలుగు మాటలు మాట్లాడితే చాలు గుండెల్లో ఉన్న బాధ మొత్తం ఎగిరిపోతుంది.

Hug Professional Cuddler Per Hour 7300

Hug Professional Cuddler Per Hour 7300

కొత్తగా ఎంతో ఉత్సహాన్ని ఇస్తుందట. ఇదీ నిజమని.. ఎంతోమంది పరిశోధనలు చేసి మరీ నిరూపించారు నిపుణులు. యావత్ ప్రపంచమే ఈ నిజాన్ని నమ్ముతున్నారు. మన పూర్వీకుల దగ్గర్నుండి ఇప్పటి వరకు అమ్మ, నాన్న, స్నేహితుడు, భార్య, భర్త, అక్క, చెల్లి ఇలా బందమేదైనా బాధగా ఉన్నప్పుడు ప్రేమగా ఓ హగ్, బాధ్యతతో నాలుగు మాటలు మాట్లాడితే ఎదుటివాళ్ళలో ఎక్కడలేని ఆనందం వస్తుంది.

ఈ ఎమోషన్ ని ఓ అమ్మాయి క్యాష్ చేసుకుంటుంది. అవును తనను ప్రేమగానో, బాధతోనో హగ్ చేసుకోండి డబ్బులు పే చేయండి అంటోంది. ఇలాంటి యూనిక్ బిజినెస్ స్టార్ట్ చేసింది. అమెరికాలో చికాగోకు చెందిన ఈ అమ్మాయి కౌగిలింతల బిజినెస్ మొదలుపెట్టింది. ఇందుకోసం గంటకు 7300 రూపాయలు చార్జ్ చేస్తుంది. మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు, ఒత్తిడికి గురైనవారు, తమకు కావాల్సిన ప్రేమ, ఆప్యాయతల కోసం ఎంతోమంది తన దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటారని అంటోంది ఈ అమ్మాయి.

తమ బావోధ్వేగాలను పంచుకోవడానికి కూడా ఎవరూ లేనివారు, జీవితంలో బిజినెస్ తప్ప పర్సనల్ లైఫ్ ను హ్యాండిల్ చేయలేనివారికి ప్రేమగా దగ్గరకు తీసుకోలేనివారు లేకపోవడం.. ఇలాంటి వారందరికి ఆమె ఓ ఓదార్పు అవుతుంది. తన వద్దకు వచ్చేవారు కౌగిలించుకోవడంతో పాటు సరదాగా మాట్లాడతారని కూడా చెబుతోంది.

ఇలా చేస్తూ రిలాక్స్ అవుతున్నారని.. తన కస్టమర్ల బాధను తగ్గించుకుంటున్నారని ఆ మహిళ సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ బిజినెస్ సరైనదే అయినా.. కొద్దిమంది వ్యక్తులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటుంది. ఏదిఏమైనా భావోద్వేగాలను పంచుకోవడానికి కూడా ఓ బిజినెస్ మొదలయ్యిందంటున్నారు నెటిజన్లు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us