Heroic Man : వైరల్ వీడియో..ఐదో అంతస్తు నుండి పడిపోతున్న చిన్నారిని అద్భుతంగా క్యాచ్ పట్టుకున్న వ్యక్తి
NQ Staff - July 26, 2022 / 08:55 AM IST

Heroic Man : ఆపదలో ఉన్నారిని కాపాడాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎలాంటి సందర్భం అయిన సరే కొందరు తమ ప్రాణాలని లెక్క చేయకుండా ఇతరులని రక్షించే సాహసం చేస్తుంటారు. ఆ సమయంలో వారి ప్రాణాలకు రిస్క్ అని తెలిసిన కూడా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు. వారని రియల్ హీరోస్ అనక తప్పదు.

Heroic Man catches falling toddler in China
రియల్ హీరో..
తాజాగా ఒకటి కాదు రెండు కాదు..ఐదు అంతస్థుల నుంచి జారి పడిన చిన్నారి. అంతలో సూపర్మ్యాన్లా దూసుకొచ్చేశాడు. అద్భుతంగా క్యాచ్ పట్టి ఆ చిన్నారి ప్రాణాలు కాపాడాడు. రియల్ హీరోకు నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక చిన్నారి ఐదవ అంతస్తు నుండి తన ఇంటి కిటికీ నుండి క్రిందికి పడిపోతున్న క్రమంలో దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ అమ్మాయిని బంతి లాగా సూపర్ క్యాచ్ పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
అక్కడొక పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఐదవ అంతస్థు నుంచి ఓ చిన్నారి కిందకు జారిపోతుంది. కిందకు జారి పడిపోతూ ఫస్ట్ఫ్లోర్పై ఉన్న టెర్రాస్‌పై పడుతుంది. అక్కడి నుంచి కూడా జారి కిందకు పడిపోబోతుంది. అంతలో అక్కడున్న ఓ వ్యక్తి వేగంగా దూసుకొస్తాడు. కింద పడిపోతున్న ఆ చిన్నారిని క్యాచ్ పట్టుకుంటాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో షేర్ కాగానే పెద్దఎత్తున వైరల్ అవుతోంది.
అందరూ ఆ వ్యక్తిని సూపర్ హీరో అని కీర్తిస్తున్నారు. ఆ వ్యక్తి 31 ఏళ్ల ఝోఝియాంగ్ ప్రాంత నివాసి. అతడి పేరు శేన్ డాంగ్ తోంగ్జియాంగ్. అక్కడే స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. . ఈ ఘటన చైనాలో జరిగింది. సకాలంలో అక్కడున్న ఆ మనిషి స్పందించకపోతే ఆ చిన్నారి ప్రాణాలు పోయేవి.