Boss : బాస్ అంటే ఇలా వుండాలి.! దీపావళి కానుకగా సిబ్బందికి కార్లు, బైకుల బహుమతి.!
NQ Staff - October 17, 2022 / 08:43 PM IST

Boss : బాస్ అంటే ఎలా వుండాలి.? సిబ్బందికి దేవుడిలా వుండాలని ఎవరైనా అనుకోకుండా వుంటారా.? ఇక్కడ, ఈ బాస్ మాత్రం ఆ సిబ్బందికి నిజంగానే దేవుడు.! ఎందుకంటే, దీపావళికి అంత గొప్ప బహుమతులు ఇచ్చాడు మరి.! సాధారణంగా పండగ అంటే బోనస్ ప్రకటించడం.. లేదంటే, స్వీట్ ప్యాకెట్‌తో సరిపెట్టడం చూశాం. కానీ, ఇక్కడ ఓ బాస్ తన సిబ్బందికి కార్లు, బైకుల్ని దీపావళి కానుకలుగా అందించాడు. దాంతో, ‘మా బాస్ నిజంగానే దేవుడు..’ అంటున్నారు ఆయన దగ్గర పనిచేస్తోన్న సిబ్బంది.
నగల వ్యాపారం.. వాహనాల్ని బహుతులుగా ఇచ్చిన వైనం.. చెన్నయ్‌కి చెందిన ఓ నగల దుకాణం యజమాని జయంతి లాల్ చాయంతి, సిబ్బందికి దీపావళి సందర్భంగా కార్లు, బైకుల్ని బహుమతులుగా ప్రకటించారు. ప్రకటించడమేంటే, వాటిని సిబ్బందికి అందించేశారు కూడా. ఇందుకోసం ఏకంగా కోటీ అరవై లక్షల రూపాయలు ఖర్చు చేశారట ఆ యజమాని. ఆ జ్యుయెలరీ సంస్థ పేరు చల్లానీ జ్యులెర్స్. పది కార్లు, ఇరవై బైకుల్ని సిబ్బందికి ఇవ్వడమే కాదు, కుటుంబాలతో సహా వారిని ఆహ్వానించి, వారికి అత్యద్భుతమైన విందు భోజనాన్నివ్వనున్నట్లూ చెప్పారట యజమాని.
‘వారంతా కేవలం నా దగ్గర పనిచేసే సిబ్బంది మాత్రమే కాదు.. వారు నా కుటుంబ సభ్యులు.. అందుకే, లాభాల్లో కొంత వాటా.. ఆయా కుటుంబాల్లో ఆనందం నింపేందుకోసం ఇలా ఖర్చు చేస్తున్నాను..’ అని జ్యుయెలరీ వ్యాపారి చెప్పారు.