Hardik-pandya: చిక్కుల్లో హార్ధిక్ పాండ్యా.. వాచ్ సీజ్ చేసిన క‌స్ట‌మ్ అధికారులు

Hardik-pandya: భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స‌మ‌స్య‌లో చిక్కుకున్నాడు. ఆదివారం నవంబర్ 14 అర్థరాత్రి ఆలస్యంగా భారత్‌కు చేరుకున్న హర్ధిక్ పాండ్యా దగ్గరున్న 5 కోట్ల విలువైన రెండు వాచీలను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ జప్తు చేసింది. దీంతో గత కొంతకాలంగా ఫామ్‌తో సతమతమవుతున్న హార్ధిక్ కొత్త ఇబ్బందుల్లో పడ్డాడు

hardik-pandya-s-watches-worth-rs-5-crore
hardik-pandya-s-watches-worth-rs-5-crore

టీ 20 వ‌ర‌ల్డ్ కప్ మ్యాచ్ కోసం దుబాయ్ వెళ్లిన పాండ్యా అక్క‌డ రెండు రిస్ట్ వాచ్‌లు కొనుగోలు చేశారు. అయితే వాటికి సంబంధించిన ఎలాంటి బిల్లులు గానీ, రిసిప్ట్స్ గానీ ఆయన వద్ద లేవు. దీనితో కస్టమ్స్ అధికారులు వాటిని సీజ్ చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ ఆడటానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడు హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌లో నిరాశ‌ప‌రిచాడు. దీంతో భార‌త్ సూపర్ 12 దశలోనే తిరుగుముఖం పట్టింది. క్రికెటర్లు..ఒక్కొక్కరుగా స్వదేశానికి చేరుకున్నారు.

హార్దిక్ పాండ్యా మాత్రం ఫైనల్స్ అయిపోయేంత వరకూ దుబాయ్‌లోనే ఉన్నాడు. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఫైనల్స్ ముగిసింది. సోమవారం రాత్రి అతను దుబాయ్ నుంచి ముంబైకి చేరుకున్నారు. అంతకుముందే అతను దుబాయ్‌లో షాపింగ్ చేశారు. రెండు అత్యంత ఖరీదైన రిస్ట్ వాచీలను కొనుగోలు చేశారు.

ఒక్కో రిస్ట్ వాచీ విలువ అక్షరాలా రెండున్నర కోట్ల రూపాయలు. అయిదు కోట్ల రూపాయలతో ఇలాంటి రెండు వాచీలను కొన్నారాయన. దానికి సంబంధించిన ఎలాంటి బిల్లులు గానీ, రిసిప్ట్‌లు గానీ హార్దిక్ పాండ్యా వద్ద లేవు. హార్దిక్ పాండ్యా లగేజీ, ఇతర వస్తువులను తనిఖీ చేయగా.. ఈ రెండు రిస్ట్ వాచీలు కొన్నట్లు తేలింది.

బిల్లులను ఇవ్వాలంటూ కస్టమ్స్ అధికారులు కోరగా.. హార్దక్ పాండ్యా చేతులెత్తేశారు. బిల్లులను తీసుకోలేదంటూ బుకాయించారు. దీనితో ఈ రెండింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హార్దిక్ పాండ్యాకు వాచీలంటే మోజు ఎక్కువ. ఇలాంటి కోట్ల రూపాయల విలువ చేసే రిస్ట్ వాచీలు ఆయన వద్ద చాలా ఉన్నాయి. ఇదివరకు పటెక్ ఫిలిప్పె నాటిలస్ ప్లాటినమ్ 5711 రిస్ట్ వాచీని అతను కొన్నాడు. దాని విలువ అయిదు కోట్ల రూపాయలు.