Hardik pandya: పాండ్యా విలువైన వాచ్‌లు సీజ్.. క్లారిటీ ఇచ్చిన ఆల్‌రౌండ‌ర్

Hardik pandya: టీ20 ప్రపంచకప్‌-2021లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ రీసెంట్‌గా దుబాయ్ నుండి ఇండియాకు వ‌చ్చాడు. యూఏఈ నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా భారత క్రికెట్ స్టార్ ఆల్‎రౌండర్ హార్దిక్ పాండ్యా‎కు ముంబై ఎయిర్‎పోర్ట్ కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు.

దుబాయ్​నుంచి వచ్చిన‌ పాండ్యా వద్ద రూ. 5 కోట్ల విలువైన రెండు చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వాటికి బిల్లులు లేవని లేవని సీజ్ చేసినట్లు తెలుస్తుంది.నవంబరు 14 రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది. సదరు వాచీలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లు పాండ్యా చూపకపోవడంతో ఈ ముంబై ఇండియన్స్‌ ఆటగాడిని ఆపిన కస్టమ్స్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై హార్దిక్ పాండ్యా స్పందించారు. నవంబర్ 15న సోమవారం తెల్లవారుజామున నేను దుబాయ్ నుండి వచ్చాను. నా లగేజీని తీసుకున్న తర్వాత, నేను తీసుకువచ్చిన వస్తువుల వివరాలు చెప్పడానికి అవసరమైన కస్టమ్స్ డ్యూటీని చెల్లించడానికి నేను స్వచ్ఛందంగా ముంబై విమానాశ్రయ కస్టమ్స్ కౌంటర్‌కి వెళ్లాను. నేను చేసిన ప్రకటనకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు అవగాహనలు వెల్లువెత్తుతున్నాయి.

దీని గురించి క్లారిటీ ఇవ్వ‌ద‌ల‌చుకున్నాను. నేను దుబాయ్ నుండి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అన్ని వస్తువులను స్వచ్ఛందంగా ప్రకటించాను. చెల్లించాల్సిన సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తవానికి, కస్టమ్స్ విభాగం అన్ని కొనుగోలు పత్రాలను కోరింది. వాచ్ ఖరీదు దాదాపు రూ. 1.5 కోట్లని, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్ల ప్రకారం 5 కోట్లు కాదు.

నేను దేశంలోని చట్టాన్ని గౌరవించే పౌరుడిని. నేను అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను గౌరవిస్తాను. నేను ముంబై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తనకు సహకరించింది. వారికి నా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చాను. ఈ విషయాన్ని క్లియర్ చేయడానికి వారికి కావాల్సిన చట్టబద్ధమైన పత్రాలను అందజేస్తాను. నాపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవి అంటూ పాండ్యా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.