Gautam adani: ముకేశ్ అంబానీని బీట్ చేసి ఆసియాలో అపర కుబేరుడిగా గౌతమ్

Gautam adani: అప‌ర కుబేరుడు ముకేష్ అంబానీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. గత కొన్నేళ్లుగా దేశంలోనే కాకుండా ఆసియాలో కూడా అత్యంత సంపన్నుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి.. భారత్​, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు గౌతమ్ అదానీ.

gautam-adani-pips-mukesh-ambani-to-become-richest-man.1JPG
gautam-adani-pips-mukesh-ambani-to-become-richest-man.1JPG

ప్రస్తుతం గౌతమ్ అదానీ సంపద విలువ ప్రస్తుతం 90 బిలియన్ డాలర్లుగా అంచనా. గత ఏడాది మార్చి 18న ఈయన సంపద 4.91 బిలియన్ డాలర్లుగా ఉండగా.. కరోనా సంక్షోభంలో అది రికార్డరు స్థాయిలో పెరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. గత ఏడాది మార్చితో పోలిస్తే గౌతమ్ అదానీ సంపద 1800 శాతం పెరిగిందని బ్లూమ్​బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ద్వారా తెలిసింది.

2015 నుంచి దేశంలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్న ముకేశ్ అంబానీ కి ఇటీవ‌ల‌ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద దెబ్బ కొట్టింది. ఆర్ఐఎల్ షేర్లు పడిపోవడంతో అంబానీ సంపద విలువ కూడా తగ్గింది. దీంతో ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ముకేశ్ అంబానీ 2015 నుంచి అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చారు. నవంబర్ 23 నాటికి బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అంబానీ మొత్తం సంపద విలువ 91 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఇటీవల రోజుకు రూ.1000 కోట్లు సంపాదిస్తూ గౌతమ్ అదానీ ముందుకు దూసుకెళ్తుంటే.. ముకేశ్ అంబగానీ సంపద కాస్త తగ్గింది. రిలయన్స్ ఓ2సీ వ్యాపారాల్లో ఆరామ్​కో పెట్టుబడుల విషయాన్ని మరోసారి సమీక్షించాలని ఇరు కంపెనీలు నిర్ణయించడంతో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోతూ వస్తున్నాయి.

gautam-adani-pips-mukesh-ambani-to-become-richest-man.1JPG
gautam-adani-pips-mukesh-ambani-to-become-richest-man.1JPG

అంబానీ నికర విలువ కూడా తగ్గుతోంది. ఇదే సమయంలో అదానీ సంపద పెరుగూ పోతున్న కారణంగా ఆయన.. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. కాగా ఈ ఏడాదిలో అదానీ సంపద 55 బిలియన్ డాలర్లు పెరిగింది. అంబానీ సంపద విలువ 14 బిలియన్ డాలర్లు పైకి కదిలింది.