Dravid: నేను ముందుగా ద్ర‌విడ్ ప్రేమ‌లో ప‌డ్డాను.. ఆయ‌న కోసం క్రికెట్ చూస్తానంటున్న న‌టి

Dravid: మిస్ట‌ర్ డిపెండ‌బుల్ రాహుల్ ద్రవిడ్ ఒక‌ప్పుడు స్క్వేర్ క‌ట్‌తో క్రికెట్ ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించేవాడు. ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ద్ర‌విడ్ కుర్ర క్రికెట‌ర్స్‌ని వెలుగులోకి తెస్తున్నాడు. ప్రత్యర్థి జట్లకు అవకాశం ఇవ్వకుండా ‘అడ్డుగోడ’గా నిలబడి జట్టును అనేక సార్లు విజయపథంలో నిలిపిన ‘వాల్‌’ ద్రవిడ్‌.

TheNewsQube-
first love of dravid2
first love of dravid2

ద్రవిడ్‌ మార్దనిర్దేశనంలో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా ద్రవిడ్‌ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడిన రిచా.. ‘‘యవ్వన దశలో ఉన్నపుడు క్రికెట్‌ అంటే నాకు అభిమానం ఉండేది. ఇంకోరకంగా చెప్పాలంటే పిచ్చి అనవచ్చు. నా సోదరుడు క్రికెట్‌ ఆడేవాడు. మ్యాచ్‌ ఉందంటే టీవీకే అతుక్కుపోయేదాన్ని. రాహుల్‌ ద్రవిడ్‌ ఆట అంటే నాకు ఎంతో ఇష్టం. అయితే, తను రిటైర్‌మెంట్‌కు దగ్గరవుతున్న కొద్దీ క్రికెట్‌ చూడటం మానేశాను. నా ఫస్ట్‌లవ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.

అందుకే తను లేని ఆటను చూడలేకపోయాను’’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు తను మరో రూపంలో డ్రెస్సింగ్‌రూంలో సందడి చేస్తున్నడు కాబట్టి.. మళ్లీ క్రికెట్‌ చూడటం ఆరంభిస్తానని రిచా పేర్కొన్నారు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు 2011లో వీడ్కోలు పలికిన ద్రవిడ్‌.. ఆ మరుసటి ఏడాది టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పాడు.

first love of dravid1
first love of dravid1

రీసెంట్‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్ ల అనంత‌రం రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘శుభారంభం చేయడం ఎప్పుడూ మంచిదే. అయితే ఈ సిరీస్‌లో అందరూ బాగా ఆడారని, ఈ విజయం తర్వాత కూడా మన పాదాలను నేలపై నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని’ టీం సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. గెలిచిన తర్వాత ధీమా పెరిగితే, తరువాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని పేర్కొన్నాడు.