Female Teacher : తాగుబోతు పంతులమ్మ సస్పెన్షన్.. ఇంత నీచం ఎక్కడైనా ఉంటుందా!
NQ Staff - September 9, 2022 / 11:12 AM IST

Female Teacher : గురువు అంటే దైవంతో సమానం.. విద్యార్థి గురువు నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. తల్లిదండ్రుల నుండి కంటే గురువు నుండి ఎన్నో విషయాలను నేర్చుకునే విద్యార్థులు గురువు తప్పుడు బాట నడిస్తే అదే తప్పుడు బాటను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

Female Teacher consumes liquor in Tumakuru school
ముఖ్యంగా గురువులు పాఠశాలలో ఉన్న సమయంలో విద్యా బోధన చేసే సమయంలో ఎంతో గొప్పగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అలాంటి గురువు స్థానంలో ఉండి ఒక మహిళ టీచర్ మద్యం సేవించి పాఠశాలకు వచ్చింది.
అంతే కాకుండా ఆమె పాఠాలను బోధిస్తూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఒక మహిళ టీచర్ మద్యం సేవించి పాఠాలను బోధిస్తున్న విషయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చినియాంశంగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు తాలూకాలో ఈ సంఘటన జరిగింది.
సదరు మహిళా టీచర్ ని అక్కడికక్కడే సస్పెండ్ చేసిన అధికారులు ఆమెపై కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. మద్యం సేవించి వచ్చిన పంతులమ్మ విద్యార్థులను అసభ్యకరంగా తిట్టడం ఇష్టానుసారంగా కొట్టడం తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పదేపదే గొడవ కొద్దిగా కామన్ గా జరుగుతుందని స్థానికులు పేర్కొన్నారు.
ఆమె మద్యం సేవించి రావడం ఇది మొదటి సారి ఏం కాదని.. స్థానికులు మరియు అదే పాఠశాలలో విధులను నిర్వహిస్తున్న ఉపాధ్యాయినిఉపాధ్యాయులు పేర్కొన్నారు.
గతంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయునికి మద్యం సేవించి స్కూల్ కి హాజరు కావద్దని హెచ్చరికలు జారీ చేసినా కూడా ఆమె పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా వెళ్లి పోయింది.
తాజాగా ఆమెను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాంతో వెంటనే ఆ టీచర్ తన గదిలోకి వెళ్లి తాళాలు వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హడావుడి చేసింది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెను అరెస్టు చేయడంతో పాటు సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు ప్రకటించారు.