నాన్న చేసిన ప‌నికి భార్యని పిన్నిగా పిల‌వాల్సిన ప‌రిస్థితి

మోడ్ర‌న్ యుగంలో రిలేష‌న్ షిప్స్‌కి విలువ లేకుండా పోయింది. మామ‌తో కోడ‌లు,అత్త‌తో అల్లుడు, అన్న‌తో చెల్లి ఇలాంటి అక్ర‌మ సంబంధాల గురించి ఎన్నో వింటున్నాం. ఇటీవ‌ల అల్వార్ జిల్లాలోని రైనీ ప‌ట్ట‌ణంలో ఓ వింత కేసు వెలుగులోకి వ‌చ్చింది. మామ‌, కోడ‌లు పెళ్లి చేసుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

Father Marries Sons Wife1
Father Marries Sons Wife1

ఆర్య‌స‌మాజంలో పెళ్లి చేసుకున్న వీరిద్దరు త‌మ వివాహాన్నిరిజిస్ట‌ర్ చేయించుకోవ‌డానికి తిస్ హ‌జారీ కోర్టుకు కూడా వెళ్లారు. తండ్రి వ‌య‌స్సున్న మామతో కోడ‌లి వివాహం జ‌రిగింద‌నే వార్త సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టింది. భ‌ర్త క‌ట్నం వేధింపుల‌కిగురి చేస్తున్న నేప‌థ్యంలో యువ‌తి త‌న మామ‌ని వివాహం చేసుకుంది.

తాజాగా ఇలాంటి కేసు మ‌రొక‌టి వెలుగులోకి వ‌చ్చింది. నాన్న క‌నిపించ‌కుండా పోయాడ‌ని కంప్లైంట్ చేస్తే వారు ఆయ‌న గురించి వెతికి కొడుకుకి స‌మాచారం అందించారు. క‌ట్ చేస్తే ఆయ‌న త‌న మాజీ భార్య‌తో సంసారం చేస్తున్నాడ‌ని తెలిసి షాక్ అయ్యాడు. వివ‌రాలలోకి వెళితే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బదౌన్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఘ‌ట‌న అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

2016లో స‌ద‌రు యువ‌కుడు మైన‌ర్‌. అప్పుడు అత‌ని వివాహం మైన‌ర్‌తోనే జ‌రిగింది. వివాహం త‌ర్వాత ఆ యువ‌కుడు రోజు తాగి వ‌చ్చి యువ‌తిని వేధించేవాడు.ఆరు నెల‌ల త‌ర్వాత ఆ అమ్మాయి అత‌నితో వేగ‌లేక విడిపోయింది. ఆ స‌మ‌యంలో యువకుడు ఊరి పెద్దల మధ్య ఇక ఎప్పుడు గొడవపడనని చెప్పాడు. కానీ ఆ యువతి అందుకు ఒప్పుకోకుండా విడాకులు తీసుకుంది.

యువ‌కుడి తండ్రి సానిటేష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగిగా ప‌ని చేస్తుండే వాడు. కొడుకు అవ‌స‌రాల‌తో పాటు అప్పుడ‌ప్పుడు డ‌బ్బులు కూడా ఇస్తుండేవాడు. అయితే కొన్ని రోజుల నుండి త‌న తండ్రి కనిపించ‌క‌పోయే స‌రికి ఆయ‌న సాంబల్‌ ప్రాంతంలో ఉంటున్నారని తెలుసుకొని ఆర్‌టీఐకి దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి జాడ తెలిసిందనగానే జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరుకొని వారు అందించిన వివరాలు చదువుకున్నాడు.

యువ‌కుడి తండ్రి త‌న మాజీ భార్యని వివాహం చేసుకున్నాడ‌ని తెలిసి షాక్ అయ్యాడు. ఇద్ద‌రు సాంబ‌ల్ ప్రాంతంలో సంసారం సాగిస్తున్నార‌ని తెలిసాక బ‌సౌలీ పోలీస్ట్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఇద్ద‌రిని పిలిచి రాజీ కుదిర్చే ప్ర‌య‌త్నం చేశారు. యువకుడి తండ్రి భార్య మాత్రం ఇప్పుడు వరుసకు కొడుకు అయ్యే అతనితో కలిసి ఉండలేనని పేర్కొంది. రెండో భ‌ర్త‌తోనే సంతోషంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. దీనిపై ఏం చేయోలో పోలీసుల‌కు పాలుపోవ‌డం లేదు.