South Africa: ఆమె గర్భిణీనే కాదు…కానీ ఒకే కాన్పులో పదిమంది పిల్లలు..
Samsthi 2210 - July 1, 2021 / 03:58 PM IST

South Africa: ఒకే కాన్పులో పదిమంది పిల్లల్ని కని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా మహిళ గొసియామో థమారా సిథోలే అనే 37ఏళ్ళ మహిళ ఒకే కాన్పులో పదిమంది పిల్లలకు జన్మనిచ్చినట్లు వచ్చిన వార్త కథనం పూర్తిగా అబద్ధమని.. సిథోలే, ఆమె భర్త ఇద్దరూ కావాలని చెప్పారని దక్షిణాఫ్రికా ప్రభుత్వం స్వయంగా తెలిపింది.

Fake News About South Africa Women 10 babies Delivery
ఈ కథనంలో లేటెస్ట్ గా ఓ ట్విస్ట్ బయటపడింది. నిజానికి ఈ మధ్య కాలంలో సిథోలే అనే మహిళ అసలు గర్భవతే కాలేదట. ఆమెను టెస్ట్ చేసిన డాక్టర్లు టెంబిసా అధికారులు మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఆమె మానసిక ఆరోగ్యంపై అనుమానంతో మెంటల్ హెల్త్ యాక్ట్ కింద అదుపులోకి తీసుకుని ట్రీట్ మెంట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రిటోరియా న్యూస్ ఎడిటర్ తొందరపాటుతనంతోనే ఈ వార్త ప్రచురితమైందని అధికారులు తెలిపారు. గతంలో కూడా ఈ దంపతులు ముగ్గురు కవల పిల్లలు పుట్టారని తెలిపారు. కాగా వారి ఆర్థిక పరిస్థితి బాలేదని విరాళాలు కూడా సేకరించారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తమ బంధువులు తెలిపారు.
ఇక రీసెంట్ గా వైరల్ అయిన పదిమంది పిల్లలు పుట్టారనే వార్తపై ప్రభుత్వం ఎంక్వయిరీ చేపట్టింది. టెంబిసాలో ఏ హాస్పిటల్ లో ఆమె డెలివరీ కోసం జాయిన్ అవ్వలేదని.. అదంతా కట్టుకథని ఆధారాలు చూపించారు. గతంలో సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డైరెక్టర్ జనరల్ ఫుల్మా విలియమ్స్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ పోస్ట్ లో.. ఒకే కాన్పులో పదిమంది పిల్లలు పుట్టారని తెలియగానే పరిశోధన చేశామని.. అయితే ఈ విషయానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని.. ఈ విషయం ఏ హాస్పిటల్ లో నమోదు కాలేదని తెలిపారు.
ఏది ఏమైనా ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజానిజాలున్నాయనే విషయాలు ఆధారాలతో సహా వార్తల్లో ప్రచురితమయ్యేలా చూసుకోవాలి. ఇక మీదటైనా ఇలాంటి వార్తలపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.