Elon Musk : ట్విట్టర్ ఉద్యోగులు మధ్యాహ్న భోజనంకి రూ.100 కోట్లు.. ఇది మరీ దుర్మార్ఘం మస్క్
NQ Staff - November 18, 2022 / 11:50 AM IST

Elon Musk : ట్విట్టర్ ని భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ తాను పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడంతో పాటు భారీగా లాభాలు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే సగానికి పైగా ఉద్యోగస్తులను తొలగిస్తున్నట్లుగా ఇప్పటికీ అధికారికంగా ప్రకటించాడు.
ఉన్న ఉద్యోగస్తులు ఎక్కువ సమయం పని చేయాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చాడు.. వారంలో ఎక్కువ సమయం చేయాల్సినట్లుగా ఉద్యోగులందరికీ సమాచారం అందించాడు. ఇదే సమయంలో ట్విట్టర్ కేంద్ర కార్యాలయం లో ఉద్యోగులందరికీ లంచ్ ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే.
ఆ లంచ్ ఖర్చు ఏకంగా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలకు పైగా అవుతుందని మస్క్ పేర్కొన్నాడు. ఇకపై మధ్యాహ్న భోజన ఖర్చులు ఉద్యోగుల భరించాలని.. యాజమాన్యంతో సంబంధం లేకుండా వారు తమ ఆహారంలో తామే తినాల్సిందే అంటూ ప్రకటించాడు.
ఉద్యోగులకు పెడుతున్న భోజనం ఖర్చులను లెక్క చూపడం దారుణం అంటూ మస్క్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సంస్థ కోసం పనిచేసే ఉద్యోగులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అనేది ఒక కంపెనీ యొక్క బాధ్యత, దాన్ని పాత యాజమాన్యం కొనసాగించింది.. కానీ ఇప్పుడు మస్క్ దాన్ని తొలగించాలనుకుంటున్నాడు.
100 కోట్లు అంటూ మస్క్ చెబుతున్న లెక్కలు నిజం కాదంటూ ట్విట్టర్ మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. రికార్డుల ప్రకారం చూస్తే ఉద్యోగస్తులు 25 శాతం మాత్రమే ఆఫీస్ కి వస్తున్నారు. కనుక ఆయన చెప్పిన దాంట్లో కనీసం 25% కూడా ఖర్చు అయ్యి ఉండకపోవచ్చు అంటూ మాజీ ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకుంటున్నారు.
మాస్క్ ట్విట్టర్ ని ఇప్పటికే నాశనం చేశాడు.. ముందు ముందు ఇంకా ఎంత నాశనం చేస్తాడు అంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.