Doraemon Show : భవనం కూలుతున్నప్పుడు 6 ఏళ్ల పిల్లాడికి ‘డోరెమాన్’ షో గుర్తుకు వచ్చి.. ప్రాణాలతో బయటపడ్డాడు
NQ Staff - January 27, 2023 / 04:45 PM IST

Doraemon Show : చిన్న పిల్లలు కార్టూన్ నెట్వర్క్ మరియు పదే పదే డోరెమాన్ వంటి కార్యక్రమాలను చూడడం తో తల్లిదండ్రులకు కోపం వస్తుంది. అయితే వాటి నుండి కూడా పిల్లలు చాలా నేర్చుకుంటారని తాజా సంఘటనతో నిరూపితమైంది.
డోరెమాన్ ఆరు సంవత్సరాల పిల్లాడి ప్రాణాలను కాపాడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల లక్నోలో ఒక భవనం కుప్ప కూలింది. ఆ ప్రమాదం నుండి బయట పడిన 14 మంది ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
అందులో ఒక కుర్రాడు ముస్తఫా. తన కుటుంబంలోనే అందర్నీ కోల్పోయిన ముస్తఫా తాను మాత్రం ఎలా బయట పడ్డాను అనే విషయం తెలియజేశాడు. తాను డోరెమాన్ షో చూస్తానని.. అందులో భూకంపాలు వచ్చినప్పుడు లేదా భవనాలు కూలుతున్నప్పుడు అందరూ కూడా టేబుల్ మీద మంచం కింద దాచుకోవాలని చెప్పారు.
డోరెమాన్ లో చెప్పినట్లుగానే తాను భవనం కూలుతున్నట్లు అనిపించడంతో వెంటనే మంచం కింద దాచుకున్నాను. ఆ కారణంగానే నేను ప్రాణాలు కాపాడుకున్నాను అంటూ ముస్తఫా చెప్పుకొచ్చాడు.
మంచం కిందకి వెళ్ళాలి అనే ఆలోచన రావడంతోనే ముస్తఫా ప్రాణాలు నిలిచాయని స్థానికులు పేర్కొన్నారు. మొత్తానికి పిల్లలు కార్టూన్ నెట్వర్క్ చూసిన ఇతర టీవీ చానల్స్ చూసిన కూడా వాటి నుండి ఎంతో కొంత నేర్చుకుంటే మంచిదే అని తల్లిదండ్రులు గుర్తించాలి.