Donkey Milk Soap: గాడిద పాలతో సబ్బు ఏంటని షాక్కవుతున్నారా..! ధర తెలిస్తే డబుల్ షాక్ అవుతారు..!!

Donkey Milk Soap: గాడిద పాలతో సబ్బు.. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా.. లేదా గాడద పాలతో సబ్బెలా అంటూ ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఈ ఒక్క ఐడియా జోర్డాన్ లో ఉండే ఎమాద్ అట్టియట్ అనే వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. కుటుంబ సభ్యులు కూడా నమ్మని ఆ వ్యక్తి మాత్రం తన మీద తాను నమ్మకాన్ని కోల్పోలేదు. అనుకున్నదే తడవుగా తన వ్యాపారాన్ని మొదలెట్టాడు.

Donkey Milk Soaps are too Cost
Donkey Milk Soaps are too Cost

ప్రస్తుతం అత్యధిక లాభాలు సాధిస్తూ తిరుగులేని వ్యాపారాన్ని చేస్తున్నారు. ఎమాద్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో పీజీ చేసారు. తన చదువుకు తగిన ఉద్యోగం దొరక్క ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. అందుకే తన తల్లి సలహాలో చిరు వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. గాడిద పాలతో సబ్బులు చేయాలని మొదట ఎమాద్ తల్లి సలహా ఇచ్చిందట. ఈ ఐడియాపై కొన్ని రోజుల పాటు గ్రౌండ్ వర్క్ చేశాడు.

ఈ ఐడియా ఎవరికి చెప్పినా వారంతా నవ్వుకోవడం, నెగిటివ్ గా విమర్శలు చేయడమే చేశారు. కానీ ఎమాద్ మాత్రం తన ఐడియాని ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్ళాడు. అంతేనా ప్రారంభించిన ఏడాదికే మంచి లాభాలు చేరాయి. ఎమాద్ అటాన్ డాంకీ మిల్క్ సోప్స్ అనే పేరుతో ఓ కంపెనీని స్టార్ట్ చేశాడు. అరబ్బీలో అటాన్ అంటే ఆడ గాడిద అని అర్థం. అలా అమ్మాన్ కు 35 కిలోమీటర్ల దూరంలో మడాబా అనే పరిసర ప్రాంతంలో 12 గాడిదల్ని పెంచుతున్నారు.

ఒక్కో గాడిద నుండి రెండు లీటర్ల పాలిస్తుంది. ఈ పాలను చల్లార్చాక.. వాటిని జోర్డాన్ రాజధానిలో ఉన్న ప్రాసెసింగ్ సెంటర్ కు పంపిస్తారు. అక్కడ ఎమాద్ తల్లి ఆధ్వర్యంలో ఈ సబ్బుల్ని తయారుచేస్తారు. ఈ గాడిద పాలకు నూనెలు, వనమూలికలు వేసి ఓ మిశ్రమాన్ని తయారుచేసి.. దాన్ని ఓ మూసలో పోసి గడ్డకట్టేలా సబ్బులా తయారు చేస్తారు. ఒక లీటరు గాడిద పాలతో 30 సబ్బులు తయారు చేయవచ్చు. అలాగే గాడిద పాల ద్వారా చర్మానికి మంచి అందం చేకూరుతుంది.

ఇంకేం జనాలంతా ప్రస్తుతం ఈ సబ్బుల కోసం తెగ ఎగబడుతున్నారు. ఎమద్ కంపెనీ ప్రస్తుతానికి నెలకు 4500 సబ్బుల్ని తయారు చేస్తున్నారు. ఈ సబ్బు ధర ఎంతో తెలుసా.. 11 డాలర్లు అంటే 807 రూపాయలన్నమాట. అదే 125 గ్రాముల సబ్బును 1000 రూపాయలకంటే పైగానే అమ్ముతున్నారు. ఐరోపాలో లీటరు గాడిద పాల ధర 70 డాలర్లు ఉంటుంది. నాణ్యమైన పాలతో సహజసిద్ధమైన వనమూలికల్ని కలిపి అందిస్తున్న చక్కని ప్రొడక్ట్ ని ప్రజలు కూడా అంతే నమ్మకంతో కొంటున్నారు.