Covid Vaccine : కోవిడ్ వ్యాక్సిన్‌తో గుండెపోటు ముప్పు పెరుగుతుందా.?
NQ Staff - October 30, 2022 / 08:53 PM IST

Covid Vaccine కోవిడ్‌కి ముందు.. కోవిడ్ తర్వాత.. ప్రజారోగ్యం విషయమై ఇలా చర్చించుకోవాల్సి వస్తోంది. కోవిడ్‌కి ముందు సాధారణ జలుబు పరిస్థితి వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. జ్వరం విషయంలో అయినా, ఇతరత్రా చిన్నా చితకా అనారోగ్య సమస్యల విషయంలో అయినా అదే పరిస్థితి.
గుండె పోటు, కిడ్నీల పనితీరు.. ఇలాంటి అంశాలకు సంబంధించి రోజుకో కొత్త అనుమానం జనాన్ని తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. ప్రధానంగా చిన్న వయసులో గుండె పోటుకి కోవిడ్ వ్యాక్సిన్ కారణమన్న ప్రచారం బలంగా జరుగుతోంది.
వ్యాక్సిన్ వల్ల గుండె పోటు ముప్పు పెరిగిందా..?
కోవిడ్ వ్యాక్సిన్ (అది ఏ బ్రాండ్ వ్యాక్సిన్ అయినాగానీ) అత్యవసర వినియోగం కిందనే.. అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచం ఎదుర్కొన్న పాండమిక్ పరిస్థితి అలాంటిది. ఎడా పెడా వ్యాక్సిన్లను పొడిచేశారు. ఒకటీ, రెండూ.. మూడూ.. ఇలా మూడు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవడం దాదాపుగా అందరికీ అనుభవమే.
అయితే, ఎంఆర్ఎన్‌ఎ వ్యాక్సిన్ వల్ల గుండెపోటు ముప్పు పెరిగిందంటూ అమెరికాలో ఓ వైద్య నిపుణుడు తన పరిశోధనలో వెల్లడించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సడెన్ కార్డియాక్ అరెస్ట్.. ఆ కారణంగా హఠాన్మరణం సంభవించడం అనేది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తోందన్నది ఆ వార్త తాలూకు సారాంశం.
కానీ, ఇందులో వాస్తవం ఎంత.? అన్నదానిపై అధికారిక ప్రకటన ఏదీ ఇంతవరకు రాలేదు.