David Puller : నూటికి పైగా మృతదేహాలపై కామ వాంఛ తీర్చుకున్న కీచకుడు.! చిన్న పిల్లలనీ వదల్లేదు.!

NQ Staff - November 4, 2022 / 10:39 PM IST

David Puller  : నూటికి పైగా మృతదేహాలపై కామ వాంఛ తీర్చుకున్న కీచకుడు.! చిన్న పిల్లలనీ వదల్లేదు.!

David Puller  : ఆ మధ్య ఓ సినిమాలో ఎనస్తీషియా డాక్టర్‌గా పని చేసిన వ్యక్తి పాత్ర, చనిపోయిన అమ్మాయిలపై తన కామ వాంఛ తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ చూసి, ఆశ్చర్యపోయాం. కానీ, ఆ కాన్సెప్టులో గత కొన్నేళ్లుగా ఈ వ్యక్తి కామ వాంఛ తీర్చుకుంటూనే వున్నాడు.

దాదాపు 101 మృత దేహాలపై లైంగిక దాడి చేసినట్లు స్వయంగా ఆ వ్యక్తి వెల్లడించాడు. ఇంతకీ ఈ కీచకుడు ఎవరు.? ఏంటా కథ.? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

మార్చురీ శవాలే టార్గెట్..

డేవిడ్ పుల్లర్ అనే వ్యక్తి 1987లో ఆగ్నేయ ఇంగ్లాండ్ ప్రాంతంలోని కెంట్ పరిసరాల్లో వున్న ఓ ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. ఆ రోజుల్లోనే ఆసుపత్రికి సమీపాన వున్న ఇద్దరు యువతుల్ని గొంతు కోసి చంపి ఆ తర్వాత వారిపై లైంగిక దాడి చేశాడట.

ఆ తర్వాత అతను పని చేసే ఆసుప్రతి మార్చురీలోనే 23 మంది మహిళల డెడ్ బాడీలపై లైంగిక చర్యకు పాల్పడ్డాడట. ఈ కీచకుడి నేరాలు నిరూపితమై గతేడాది అరెస్టయ్యాడు. జీవిత ఖైదు కూడా పడింది.

అయితే, ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని నమ్మలేని నిజాల్ని పోలీసులు ఈ వ్యక్తి నుంచి స్వయంగా రాబట్టే ప్రయత్నం చేశారు. విస్తుపోయే నిజాలు బయట పడ్డాయ్.
చిన్న పిల్లల మృతదేహాల్ని సైతం వదిలి పెట్టలేదీ క్రూరుడు.

2008 నుంచి, 2020 వరకూ ఏకంగా 101 మృత దేహాలతో తన కామ క్రీడను అనుభవించినట్లుగా తెలిసింది. జీవిత ఖైదు అనేది ఇలాంటి కామాంధుడికి చిన్న శిక్ష. అంతకు మించిన కఠినమైన శిక్ష పడాలని ఈ న్యూస్ తెలిసిన నెటిజనం గుస్సా అవుతున్నారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us