ముగిసిన డైలీ హంట్ – ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ ‘స్టోరీ ఫర్ గ్లోరీ’ టాలెంట్ హంట్.!

NQ Staff - September 28, 2022 / 04:57 PM IST

ముగిసిన డైలీ హంట్ – ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ ‘స్టోరీ ఫర్ గ్లోరీ’ టాలెంట్ హంట్.!

భారతదేశ వ్యాప్తంగా టాలెంటెడ్ స్టోరీ టెల్లర్స్‌ని వెలికి తీసేందుకోసం డైలీ హంగ్ అలాగే ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ సంయుక్తంగా ‘స్టోరీ ఫర్ గ్లోరీ’ అనే టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని చేపట్టాయి. రెండు కేటగిరీల కింద మొత్తం 12 మంది విజేతల్ని ఈ హంట్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది.

ఈ ఏడాది మే నెలలో ప్రారంభమై నాలుగు నెలలపాటు ఈ ‘టాలెంట్ హంట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెయ్యికి పైగా అభ్యర్థులు ప్రముఖ మీడియా సంస్థ ఎంఐసీఏలో ఎనిమిది వారాల పాటు ఫెలో షిప్, రెండు వారాల పాటు లెర్నింగ్ ప్రోగ్రామ్ పొందారు.

శిక్షణ తర్వాత ఆరు వారాల పాటు తమ ఫైనల్ ప్రాజెక్టులో పని చేశారు. ఈ క్రమంలో ప్రముఖ మీడియా పబ్లిషింగ్ సంస్థల నుంచి సూచనలూ అందుకున్నారు అభ్యర్థులు.

ముగింపు ఈవెంట్‌కి 20 మంది ఫైనలిస్టులు..

మొత్తంగా 20 మంది ఫైనలిస్టులు తమ ప్రాజెక్టుల్ని ఫైనల్ ఈవెంట్‌కి సమర్పించడం జరిగింది. అందులో 12 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. డైలీ హంట్ వ్యవస్థాపకుడు వీరేంద్ర గుప్తా, సంజయ్ పుగాలియా (సీఈవో, ఎడిటర్ ఇన్ చీఫ్ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్), అనంత్ గోయెంకా (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), అనుపమ చోప్రా (ఫిలిం కంపానియన్), శైలీ చోప్రా (షీ ది పీపుల్ ఫౌండర్), నీలేష్ మిశ్రా (గావ్ కనెక్షన్ వ్యవస్థాపుడు), పంకజ్ మిశ్రా (ఫ్యాక్టర్ డైలీ కో ఫౌండర్) తదితరులు వున్నారు.

డైలీ హంట్ వ్యవస్థాపకుడు గవీరేంద్ర గుప్తా మాట్లాడుతూ, భారతదేశంలోని స్టోరీ టెల్లర్స్‌లో ప్రతిభావంతులైనవారిని కనుగొనేందుకు తాము సాంకేతికతను వినియోగించుకున్నట్లు చెప్పారు. డిజిటల్ న్యూస్, మీడియా స్పేస్ గణనీయంగా పురోగమిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఏఎంజీ మీడియా సీఈవో, ఎడిటర్ ఇన్ చీఫ్ సంజయ్ పుగాలియా మాట్లాడుతూ, డైలీ హంట్‌తో కలిసి తాము నెక్స్‌ట్ జనరేషన్ చరిత్రకారుల్ని గుర్తించగలిగామని అన్నారు. స్టోరీ ఫర్ గ్లోరీని భారతదేశంలోని కళలు, సంస్కృతి, కరెంట ఎఫైర్స్, న్యూస్, టెక్నాలజీ వంటివాటిపై రాతపూర్వక ఫార్మాట్‌లో కంటెంట్ సృష్టికర్తల్ని కనుగొనేందుకు చేసిన ప్రయత్నమని వివరించారు.

కాగా, డైలీ హంట్ భారతదేశంలోని 15 భాషల్లో 1 మిలియన్ పైగా కొత్త తరహా కంటెంట్‌ని అందిస్తోంది. 50 వులకు పైగా కంటెంట్ పార్టనర్లు పని చేస్తున్నారు. డైలీ హంట్ ప్రతినెలా 350 మంది నెలవారీ యాక్టివ్ యూజర్లకు సేవలు అందిస్తోంది. సగటున యాక్టివ్ యూజర్ డైలీ హంట్‌లో గడిపే సమయం 30 నిమిషాలు. ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్ టెక్నాలజీలు ద్వారా కంటెంట్ స్మార్ట్ క్యూరేషన్‌ని ఎనేబుల్ చేస్తాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ వెబ్‌లలో డైలీ హంట్ యాప్ అందుబాటులో వుంది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us