Covid 19 : కోవిడ్ కొత్త వేవ్.! భయపెడుతోందిట.. నిజమేనా.?
NQ Staff - August 18, 2022 / 08:11 AM IST

Covid 19 : కోవిడ్ వైరస్ ఇప్పట్లో మానవాళిని వదిలేలా కనిపించడంలేదు. రెండు డోసులు మాత్రమే కాదు, మూడు డోసులు పూర్తి చేసుకున్నా, కోవిడ్ మహమ్మారి వదిలి పెట్టేలా లేదు పరిస్థితి.

Covid 19 new variant in india
భారతదేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ అత్యంత వేగంగా జరిగింది. ఇంకోపక్క మూడో డోస్ (ప్రికాషనరీ డోస్) కూడా వేగంగానే వేస్తున్నారు. అయినాగానీ, కోవిడ్ విజృంభణ ఆగడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్థిరంగా వుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కేసులు బాగానే నమోదవుతున్నాయి.
ఆసుపత్రుల్లో చేరికల సంగతేంటి.?
గతంతో పోల్చితే, కోవిడ్ విషయంలో పెద్దగా భయాల్లేవు. వచ్చినా, రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతుందన్న భావన చాలామందిలో వుంది. అలా కొంతమందికి జరుగుతోంది కూడా. వ్యాక్సినేషన్ దాదాపు పూర్తవడంతో, ప్రజల్లోనూ కోవిడ్ పట్ల నిర్లక్ష్యం పెరుగుతోంది.
కాగా, ఢిల్లీలో కేసుల తీవ్రత ఎలా వున్నా, అక్కడ ఆసుపత్రుల్లో చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి. కొందరు ఐసీయూలో చికిత్స పొందాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కోవిడ్ నిబంధనల్ని మళ్లీ షురూ చేశారు. కఠినంగా వాటిని అమలు చేస్తున్నారు కూడా.
కొత్త వేరియంట్ వల్లనే ఈ పరిస్థితి అనీ, మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి సైతం అనారోగ్య సమస్యలు ఎక్కువగానే వుండొచ్చన్న నిపుణుల హెచ్చరికలతో ఇదిగానీ కొత్త వేవ్ కాదు కదా.? అన్న భయం జనంలో పెరుగుతోంది. అయినాగానీ, కోవిడ్ నిబంధనల్ని ఎవరూ పాటించడంలేదు.