Marriage: పెళ్లి కోసం రూ.790 కోట్లు ఖ‌ర్చు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డ్

Marriage: రెండు మ‌న‌సులు, అనేక కుటుంబాల‌ను ఒక్క‌టి చేసే అద్భుత‌మైన బంధం వివాహం. ఇప్పుడు ప్ర‌తి చోట వివాహ వ్య‌వ‌స్థ న‌డుస్తుంది. పెళ్లి , పిల్ల‌లు అంద‌మైన జీవితం ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. అయితే ఈ రోజుల‌లో వివాహాల‌ను ఎంత గ్రాండ్‌గా చేసుకుంటున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. భారీ ఖ‌ర్చుతో ఆకాశమంత పందిరి … భూదేవి అంతపీట వేసి అంగరంగ వైభోగంగా పెళ్లి చేస్తున్నారు.

Costliest Marriage in the World
Costliest Marriage in the World

డబ్బుకు ఏ మాత్రం వెన‌కాడ‌కుండా పెళ్లిళ్లు జ‌ర‌గుతుండ‌గా, కొన్ని పెళ్లి వేడుకుల చ‌రిత్ర‌లు సృష్టించాయి. ఇందులో మొద‌టగా చెప్పుకోవ‌ల‌సి వ‌స్తే ప్రిన్సెస్‌ డయానా-చార్లెస్‌ వివాహ వేడుక. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన వేడుక‌గా ఇది నిల‌వ‌గా, 1981లో జరిగిన వీరి వివాహ వేడుక కోసం మొత్తం నగరాన్ని లైట్లతో దేదీప్యమానంగా అలంకరించారు. సుమారు 790 కోట్ల రూపాయల‌తో ఈ వివాహ వేడుక జ‌రిపిన‌ట్టు స‌మాచారం.

Costliest Marriage in the World
Costliest Marriage in the World

ఇక వనిషా మిట్టల్‌-అమిత్‌ భాటియా వివాహం కూడా అట్ట‌హాసంగానే జ‌రిగింది. 2004లో వనిషా-అమిత్‌ భాటియాల వివాహం పారిస్‌లో అంగరంగ వైభవంగా జరిగగా, ఈ వివాహానికి ఏకంగా 55 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 408 కోట్లు) ఖర్చు చేశారు. 20వ శాతాబ్దపు అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా చరిత్ర సృష్టించింది.

Costliest Marriage in the World
Costliest Marriage in the World

ప్రిన్స్‌ విలియం-కేట్‌ మిడిల్‌టన్‌ల పెళ్లి వేడుకప్రపంచంలోనే మరో అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచింది. తల్లి డయానా బాటలోనే కుమారుడు ప్రిన్స్‌ విలియం వివాహం కూడా ఘ‌నంగా జరిగింది. ఏప్రిల్ 29, 2011న వారి వివాహం జ‌ర‌గ‌గా, వీరి పెళ్లి వేడుక కోసం 34 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. మన కరెన్సీలో చెప్పాలంటే 244 కోట్ల రూపాయలన్నమాట.

Costliest Marriage in the World
Costliest Marriage in the World

ఇషా అంబానీ-ఆనంద్‌ పిరమాల్‌ వివాహం కూడా ఎంతో వైభవంగా జ‌రిగింది. 12, డిసెంబర్, 2018 న ఈ వివాహ వేడుక జ‌ర‌గ‌గా, తన కుమార్తె వివాహం కోసం అంబానీ 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని స‌మాచారం. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఇషా-ఆనంద్‌ పిరమాల్‌ల వివాహ వ్యయం 15 మిలియన్ డాలర్లకు మించలేదని (దాదాపు 111 కోట్ల రూపాయలు) తెలిపింది.ఈ వేడుక‌కు దేశ విదేశాల నుండి అన్ని రంగాల‌కు చెందిన వారు హాజ‌ర‌య్యారు.

Costliest Marriage in the World
Costliest Marriage in the World

లిజా మిన్నెల్లి-డేవిడ్ గెస్ట్‌ల వివాహానికి 3.5 మిలియన్ డాలర్లు (రూ .26 కోట్లు) ఖర్చు చేయ‌గా, హాలీవుడ్ ప్రసిద్ధ నటీమణులలో ఒకరైన ఎలిజబెత్ టేలర్ 1991 లో లారీ ఫోర్టెన్స్కీ అనే భవన నిర్మాణ కార్మికుడిని వివాహం చేసుకోగా, ఈ వివాహానికి 1.5 నుంచి 2 మిలియన్ డాలర్లు (రూ. 11-14 కోట్లు) ఖర్చు చేశారు. ఇంత ఘ‌నంగా వివాహం చేసుకున్న వారు 5 సంవ‌త్స‌రాల‌కే విడాకులు తీసుకోవ‌డం గ‌మ‌న‌ర్హం.