Chiranjeevi : చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ నాయకుడేనా.! పీసీసీ ఐడీ కార్డు సారాంశమేంటి.?

NQ Staff - September 21, 2022 / 07:23 PM IST

159944Chiranjeevi : చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ నాయకుడేనా.! పీసీసీ ఐడీ కార్డు సారాంశమేంటి.?

Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ‘డెలిగేట్’గా మెగాస్టార్ చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తోంది. అంటే, ఆయన ఇంకా కాంగ్రెస్ నాయకుడేన్నమాట. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజ్యసభకు ఎంపికయ్యారు.

Chiranjeevi is now in Congress party

Chiranjeevi is now in Congress party

కాంగ్రెస్ హయాంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారం కోల్పోయాక, రాజ్యసభ పదవీ కాలం ముగిశాక చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. చిరంజీవిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.

ఇంకా కాంగ్రెస్ నాయకుడేనట..

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఓ ఐడీ కార్డు జారీ చేసింది ‘కొణిదెల చిరంజీవి’ పేరుతో. సీరియల్ నెంబర్ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పీసీసీ డెలిగేట్‌గా చిరంజీవిని పేర్కొన్నారు.. చిరంజీవి ఫొటోతో సహా.

Chiranjeevi is now in Congress party

Chiranjeevi is now in Congress party

త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ఈ ఎన్నికల్లో చిరంజీవి ఓటు వెయ్యాలన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యం కావొచ్చు. నిన్ననే మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ నుంచి ఓ డైలాగ్ వదిలారు. ‘రాజకీయాల్ని నేను వదిలేసినా.. నన్ను రాజకీయాలు వదలడంలేదు’ అని.

ఈ ఐడీ కార్డు చూస్తోంటే, ఇది సినిమా డైలాగు కాదు.. చిరంజీవి మనసులో మాట.. అనే విషయం అర్థమవుతోంది.