భార్యతో బూతులు మాట్లాడిస్తూ యూట్యూబ్ ఛానెల్ నడిపి.. చివరికి కటకటాలపాలయ్యాడు

ఈమధ్య కాలంలో ఫేమస్ అవ్వాలన్నా, డబ్బు సంపాదించాలన్నా యూట్యూబ్ అడ్డాగా మారింది. అలాగే ఆన్ లైన్ గేమింగ్ స్ట్రీమింగ్ కూడా చేస్తూ మరింత పాపులారిటీ సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమింగ్ కామెంట్రీలో అశ్లీల భాషను వాడుతున్న యూట్యూబర్ ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

Chennai Youtuber PUBG Madhan Arrested
Chennai Youtuber PUBG Madhan Arrested

అసలు విషయానికి వస్తే.. టాక్సిన మదన్ అనే వ్యక్తి యూట్యూబ్ లో ఓ గేమింగ్ ఛానెల్ ను రన్ చేస్తున్నాడు. ఈ వ్యక్తి అసభ్యకరమైన భాష వాడుతూ, అశ్లీల సంస్కృతిని సోషల్ మీడియాలో వ్యాపింపజేస్తున్నాడనే అభియోగాలతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ యూట్యూబర్ మదన్ పేరుతో క్రియేట్ చేసిన నిషేధించిన పబ్ జీ గేమ్ ట్రిక్స్ గురించి, గేమ్ ఆడే విధానంపై వీడియోలు చేసేవాడు.

ప్రజంట్ ఆ ఛానెల్ కు 8 లక్షల వరకు సబ్ స్క్రైబర్లు ఉన్నారు. గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ కోసం రీసెంట్ గా మరో యూట్యూబ్ ఛానెల్ ను ఓపెన్ చేశాడు. ఈ ఛానెల్ లో గేమ్ ఆడుతున్నప్పుడు మైనర్ అమ్మాయిలు, యువతులతో అసభ్యకరంగా మాట్లాడుతూ, కామెంట్రీలతో లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకునేవాడు. మదన్ వీడియోలతో అశ్లీల భాషను ఉపయోగిస్తున్న విషయంపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే మదన్ యూట్యూబ్ ఛానెళ్ళ బాధ్యతల్ని అతని భార్య కృతిక హ్యాండిల్ చేసుకునేది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు, జూన్ 16 న కృతికను అరెస్ట్ చేశారు. తమకు సంబంధించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్పెషల్ టీమ్ తో ధర్మపురి గ్రామంలో మదన్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి రెండు లగ్జరీ కార్లు, ఒక యాపిల్ ట్యాబ్ ని స్వాధీనం చేసుకున్నారు.

ఇక యూట్యూబ్ ఛానెల్స్ తో భారీగా ఆస్తులు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మదన్ పై సుమారుగా 160కు పైగా ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. యూట్యూబర్ మధన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.