Bus Shelter: బ‌స్ స్టాప్ దొంగ‌త‌నం.. ఎందుకో తెలిస్తే అవాక్క‌వ్వ‌డం ఖాయం..!

Bus Shelter: సాధార‌ణంగా న‌గ‌దు, బంగారం,త‌దిత‌ర వ‌స్తువులు దొంగ‌త‌నం గురించి విన్నాం కాని, ఈ బ‌స్ స్టాప్ దొంగ‌త‌నం ఏంటో కొత్తగా ఉంది క‌దా! మీరు చ‌దివింది క‌రెక్ట్. బ‌స్ స్టాప్ దొంగ‌త‌నం జ‌రిగింది. అది ఎక్కోడో కాదు మ‌న‌కు ద‌గ్గ‌ర‌లోఉన్న క‌ర్ణాట‌క రాష్ట్రంలోనే. బెంగ‌ళూరులోని టీసీ ప‌ల్యా మెయిన్ రోడ్‌లో ఉన్న బ‌స్ స్టాప్ దొంగ‌త‌నం చేశారు.

Bus Shelter Stolen in Bangalore
Bus Shelter Stolen in Bangalore

కొంద‌రు దుర్మార్గులు బ‌స్ స్టాప్‌పై ఉన్న రూఫ్‌ని వెల్డింగుల‌తో క‌త్తిరించి ఎత్తుకెళ్లారు. బ‌స్ స్టాప్ దొంగ‌త‌నం ఎందుకు జ‌రిగిందా అని పోలీసులు ఆరా తీయ‌గా, అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. బ‌స్టాప్ క‌ట్టిన త‌ర్వాత దాని వెన‌క క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ నిర్మించార‌ట‌. ఆ కాంప్లెక్స్‌లో ప‌లు షాపులు రెంట్‌కి కూడా ఇచ్చార‌ట‌.

బ‌స్ స్టాప్ వ‌ల‌న షాప్ క్లోజ్ క‌నిపించ‌డం లేద‌ని,దాని వ‌ల‌న బిజినెస్ దెబ్బ తింటుంద‌ని గ‌తంలో కంప్లైంట్ ఇచ్చిన ఎవ‌రు ప‌ట్టించుకోలేదు.ఈ కార‌ణంతోనే బ‌స్ స్టాప్‌ని దొంగిలించి ఉంటార‌ని స్థానికులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.