Sleep: వధువుని ప‌క్క‌న పెట్టుకొని కుంభ‌క‌ర్ణుడిలా ప‌డుకున్న వ‌రుడు

Sleep: పెళ్లంటే చాలా మందిలో ఉత్సాహం ఉంటుంది. బ్యాచిల‌ర్ లైఫ్‌కి విముక్తి ప‌లికి కొత్త జీవితం మొద‌లు పెడుతున్నామ‌నే స‌రికి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఫీల‌వుతుంటారు. ముందు నుండే ఎన్నో ప్ర‌ణాళిక‌లు వేసుకుంటారు. ఇక పెళ్లి పీట‌ల‌పై ఉన్న‌ప్పుడు ఆ సంతోషం మ‌రో లెవ‌ల్ లో ఉంటుంది. పెళ్లి పిల్లాడు, పెళ్లి పిల్ల స్టేజ్‌పై చాలా యాక్టివ్‌గా క‌నిపిస్తూ ఉంటారు.

Bride Groom in Sleep During Marriage
Bride Groom in Sleep During Marriage

కాని ఇక్క‌డ చూస్తే అంతా రివ‌ర్స్ ఉంది. దీనిని చూసి వీడెక్క‌డోడురా బాబు అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. వివ‌రాల‌లోకి వెళితే ఒక‌ప్పుడు పెళ్లిళ్లు ఎంతో అట్ట‌హాసంగా జ‌రిగేవి. కరోనా వ‌ల‌న ప‌రిస్థితులు మారాయి. ఏదో సాదాసీదాగా జ‌రిపిస్తున్నారు. ఇప్పుడు క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పెళ్లిళ్ల హంగామా జోరుగా సాగుతుంది.

ఈ పెళ్ళిళ్ల‌లో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ వరుడు తన పెళ్లి రిసెప్షన్‌లో ఏకంగా నిద్రపోతూ కెమెరాకు కనిపించి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి హల్‌ చల్‌ చేస్తోంది. రిసెప్ష‌న్‌లో వ‌ధువు ప‌క్క‌న ఉన్న‌ప్పుడు వ‌రుడు కుంభ‌క‌ర్ణుడిలా నిద్ర‌పోతున్నాడు. బంధువులు ఎంత‌గా లేపినా కూడా పెళ్లి కొడుకు లేవక అలానే గుర్రుగా నిద్ర‌పోతూనే ఉన్నాడు.

పెళ్లిలో ఎంత అల‌సిపోయినా కూడా మ‌రీ ఇంత‌లా అల‌సిపోరు. వీడేదో తేడాగా ఉన్నాడుగా అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవ‌ల పెళ్లిళ్ల‌కు సంబంధించిన మ‌రికొన్ని వార్త‌లు ఇలానే వైర‌ల్ అయ్యాయి. . ఓ వధువు స్వీటు తినిపిస్తుంటే వరుడు తినకపోవడంతో ఆమె కోపంతో విసిరి కొట్టింది. మరో ఘటనలో వరుడు గుట్కా నమిలాడని వధువు వివాహాన్నే వద్దనేసింది. మొత్తానికి గ‌త కొద్ది రోజులుగా పెళ్లికి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు నెటిజ‌న్స్‌కి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి.