Mumbai : వైఫై పాస్ వర్డ్ కోసం హత్య.. ముంబైలో దారుణం

NQ Staff - November 2, 2022 / 09:20 AM IST

Mumbai : వైఫై పాస్ వర్డ్ కోసం హత్య.. ముంబైలో దారుణం

Mumbai : ఉత్తర భారత దేశంలో 100 రూపాయలకు 1000 రూపాయలకు మర్డర్లు జరుగుతున్నాయని.. అక్కడ సభ్య సమాజం తలదించుకునే విధంగా నేరాలు ఘోరాలు సంభవిస్తున్నాయంటూ ప్రతి రోజు వార్తలు చూస్తూనే ఉంటాం.

ఈసారి 17 ఏళ్ల కుర్రాడిని ఇద్దరూ అత్యంత దారుణంగా చంపేసిన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే ముంబైలోని కమోతే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

17 ఏళ్ల కుర్రాడుని ఇద్దరు వ్యక్తులు వైఫై హాట్స్పాట్ పాస్వర్డ్ చెప్పాల్సిందిగా అడిగారు. అయితే ఆ కుర్రాడు పాస్వర్డ్ చెప్పేందుకు నిరాకరించాడట. దాంతో ఆ కుర్రాడి పై ఆ ఇద్దరు వ్యక్తులకు కోపం వచ్చి విచక్షణ రహితంగా కొట్టారట.

అయినా కూడా పాస్వర్డ్ చెప్పక పోవడంతో గొడవకు దిగడం జరిగింది. పరిస్థితి ఒకసారి గా ఉద్రిక్తంగా మారింది. దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు 17 ఏళ్ల కుర్రాడిని తమతో తెచ్చుకున్న కత్తి తో అత్యంత కిరాతకంగా పొడిచి చంపారట.

కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు విచారణ జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేశారా లేదా అనే విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి దారుణంగా వైఫై పాస్వర్డ్ చెప్పలేదని చంపేయడమేమిటో ముందు ఇంకా ఎలాంటి నేరాలు ఘోరాలు చూడాల్సి వస్తుందో.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us