WhatsApp : ప్రియురాలితో చాటింగ్ చూసిన పక్క వ్యక్తి.. ఆరు గంటల పాటు నిలిచిన విమానం
NQ Staff - August 16, 2022 / 10:57 AM IST

WhatsApp : విమానంలో తోటి ప్రయాణికుడు తన గాళ్ ఫ్రెండ్‌తో చేస్తున్న చాటింగ్ చూసిన పక్క వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో విమానం ఆరుగంటల పాటు నిలిచిపోయింది. వివరాలలోకి వెళితే మంగళూరు నుంచి ముంబై వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్‌కు రెడీ అయింది. ప్రయాణికులు సీటు బెల్టులు ధరించి సిద్ధంగా ఉన్నారు.

Bomber Word in WhatsApp chat on Passenger of flight
ఉలిక్కిపడేలా చేశారుగా..!
ఈ క్రమంలో విమానంలో తన ముందు సీట్లో కూర్చున్న యువకుడు తన ప్రియురాలితో చేస్తున్న చాటింగ్‌ను పక్క సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికురాలు చూసింది. అందులో ‘యు ఆర్ ద బాంబర్’ అన్న మెసేజ్ కనిపించింది. అంతే వెంటనే కీడు శంకించిన ఆమె విషయాన్ని విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. అప్రమత్తమైన కేబిన్ సిబ్బంది దానిని పైలట్ దృష్టికి తీసుకెళ్లడంతో విమానం టేకాఫ్ ఆగిపోయింది.
సరదాగా పెట్టిన మెసేజ్ ఆయనకు లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టింది. బాంబర్ విషయం గురించి తెలిసి ఆ యువకుడిని విచారించారు. ప్రయాణికుల బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ యువకుడిని వెళ్లేందుకు అనుమతించలేదు. చివరకు తన గర్ల్ ఫ్రెండ్‌తో చాట్ విషయం చెప్పగా.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత అతనిని అనుమతించారు. అలా విమానం ఏకంగా 6 గంటల పాటు ఆలస్యమైంది. వారు ఏదో సరదాగా చేస్తే అదీ సీరియస్ ఇష్యూ అయ్యింది.
తర్వాత విషయం గురించి పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఘటనపై 505 1బీ, సీ సెక్షన్ల కింద బాజ్పే పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళూర్ నుంచి వెళ్లాల్సిన విమానంలో యువకుడు బయల్దేరారు.. కానీ అతని గర్ల్ ఫ్రెండ్ మాత్రం విచారణ చేయడంతో.. ఆమె బెంగళూరు ప్లైట్ మిస్సయ్యింది. ఆ తర్వాత ఇండిగో విమానం 185 మంది ప్రయాణికులతో బయల్దేరింది.