Bithiri Sathi : బిత్తిరి సత్తి హీరోల రేంజ్ ‘రోవర్‌’ కారు.. ఖరీదు ఎంతో తెలుసా?

NQ Staff - October 6, 2022 / 10:10 AM IST

Bithiri Sathi : బిత్తిరి సత్తి హీరోల రేంజ్ ‘రోవర్‌’ కారు.. ఖరీదు ఎంతో తెలుసా?

Bithiri Sathi : ఒక చిన్న టీవీ కార్యక్రమంలో కనిపించడం మొదలుకొని ఇప్పుడు రేంజ్ రోవర్ కొనే స్థాయికి చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి వెళ్ళాడు. ఆయన బుల్లి తెరపై, వెండి తెరపై, సోషల్ మీడియా, యూట్యూబ్ ఇలా అన్ని రకాలుగా అన్నిచోట్ల అభిమానులను సొంతం చేసుకున్నాడు.

తనదైన శైలి ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచుతున్న బిత్తిరి సత్తి ఈ మధ్య కాలంలో భారీగా ఆదాయాన్ని పొందుతున్నాడు. అందుకే తాజాగా దాదాపు 75 లక్షల రూపాయల ఖరీదు చేసే కారును ఆయన కొనుగోలు చేశాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఈ ఫోటోను చూస్తూ ఉంటే నిజంగానే బిత్తిరి సత్తి రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడని అంతా నమ్ముతున్నారు. కానీ అధికారికంగా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

త్వరలోనే బిత్తిరి సత్తి తన కారు గురించి ఒక క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. ఈ నేపథ్యంలో బిత్తిరి సత్తికి రేంజ్ రోవర్ కార్ కొనుగోలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు అనేది కొందరి అభిప్రాయం.

మొత్తానికి కడు పేద కుటుంబం నుండి వచ్చిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి ఇప్పుడు లక్షల విలువైన కార్లలో తిరుగుతూ స్టార్స్ సూపర్ స్టార్స్ కి వాంటెడ్ గా మారాడు అంటే ఆయన కష్టానికి ఏ స్థాయిలో ఫలితం దక్కిందా అర్థం చేసుకోవచ్చు.

ఒకప్పుడు సహాయ దర్శకుడిగా ప్రయత్నించిన బిత్తిరి సత్తి ఇప్పుడు ఎంతో మంది దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us