Biryani: ఐదు పైస‌ల‌కు టేస్టీ బిర్యాని.. జ‌నం తాకిడి త‌ట్టుకోలేక దుకాణం బంద్

Biryani: బిర్యానీ అనే ప‌దం వింటే నోట్లో లాలాజ‌లం ఊరుతుంది. బిర్యానీ ధ‌ర రోజురోజుకు పైకి పోతు్నా కూడా భోజ‌న ప్రియులు మాత్రం ఏ మాత్రం వెన‌కాడ‌డం లేదు. ఎంత ధ‌ర అయితే కొనుక్కుంటున్నారు. బిర్యానీ ధ‌ర సాధార‌ణంగా వంద‌కి పైనే ఉంటుంది. కాని ఓ హోట‌ల్ య‌జమాని ఐదు పైస‌ల‌కే బిర్యానీ అనే స‌రికి జ‌నం ఎగ‌బ‌డ్డారు. క్యూల మేర నిలుచొని బిర్యానీ తీసుకుపోయేందుకు సిద్ద‌మ‌య్యారు.

Biryani for 5 Paise in Tamilnadu
Biryani for 5 Paise in Tamilnadu

త‌మిళ‌నాడులోని తమిళనాడులోని మధురై జిల్లా సెల్లూర్‌లో సుకన్య బిర్యానీ హోటల్‌ ప్రారంభమైంది. హోట‌ల్ గురించి న‌లుగురికి తెలియాలని ప్రారంభ ఆఫ‌ర్‌గా 5 పైస‌ల నాణెం తెస్తే బిర్యానీ ఇస్తామ‌ని అన్నారు. జ‌నాల నుండి ఊహించని రీతిలో స్పందన వ‌చ్చింది. ఈ రోజుల్లో ఐదు పైస‌లు నాణెలు పెద్ద‌గాఎవ‌రి ద‌గ్గ‌ర ఉండ‌వ‌ని భావించిన య‌జ‌మాని ఇలాంటి ఆఫ‌ర్ పెట్ట‌డంతో ఆయ‌న అంచ‌నాల‌ని త‌ల‌కిందులు చేశారు.

Biryani for 5 Paise in Tamilnadu
Biryani for 5 Paise in Tamilnadu

జనాలు ఐదు పైసల నాణెం తీసుకుని వచ్చి హోటల్‌ ముందు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. చిన్నా లేదు పెద్దా లేదు దాదాపు 300 మంది ఐదు పైస‌ల నాణెం ప‌ట్టుకొని బిర్యానీ షాపు ముందు నిలుచున్నారు. ఎప్పుడెప్పుడు బిర్యానీ ఆర‌గిస్తామా అనే ధ్యాస‌లోనే ఉన్న జ‌నాలు క‌రోనా ఉంద‌నే విష‌యాన్ని కూడా మ‌ర‌చిపోయారు.

Biryani for 5 Paise in Tamilnadu
Biryani for 5 Paise in Tamilnadu

పెద్ద ఎత్తున జ‌నాలు రావ‌డంతో హోట‌ల్ యాజమాన్యం చేతులెత్తేసింది. చేసేదేం లేక ష‌ట‌ర్స్ మూసి వేసింది. ఆల‌స్యంగా వ‌చ్చిన కొంద‌రు నాణెం తెచ్చిన‌ప్ప‌టికీ బిర్యానీ ఇవ్వ‌లేదు. కొంత మందికి మాత్ర‌మే హోట‌ల్ వారు బిర్యానీ త‌యారు చేయగా, 300కి పైగా జ‌నాలు ఒక్క‌సారి ప్ర‌త్యేక్ష‌మ‌య్యే స‌రికి హోట‌ల్ వారి మైండ్ బ్లాక్ అయిపోయింది. గ‌తంలో దిండిగల్‌ పట్టణంలో కూడా ఇలాంటి ఆఫర్‌ ప్రకటించారు.అప్పుడు కూడా జ‌నాలు భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు.