Kuppam: చంద్ర‌బాబుకి మ‌రో షాక్.. కుప్పంలోను న‌డిచిన ఫ్యాన్ హ‌వా

Kuppam:చంద్ర‌బాబుకి దెబ్బ మీద దెబ్బ ప‌డుతుంది. సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టిన అధికార వైసీపీ.. కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. గతంలో జరిగిన పంచాయతీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కుప్పం పరిధిలో టీడీపీకి వైసీపీ షాకిచ్చింది. ఇప్పుడు అదే దూకుడుతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికి ఝలక్ ఇచ్చింది.

big shoct cbn at kuppam1
big shock cbn at kuppam1

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభం అయ్యింది. పెండింగ్ లో ఉన్న మున్సిపాల్టీలకు ఈ నెల 15న పోలింగ్ జరిగింది. పోలింగ్ సందర్బంలో ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోటీ పోటీగా ప్రచారం చేశాయి.

నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. కుప్పంలో 25 వార్డులు ఉండగా.. ఇందులో ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 24 వార్డులకు ఎన్నికలు జరిగాయి.

big shoct cbn at kuppam2
big shock cbn at kuppam2

తొలి రౌండ్‌లో 15 వార్డుల కౌంటింగ్ ముగిసింది. ఇప్పటికే 14 వార్డు ఏకగ్రీవం కాగా.. మిగిలిన వార్డుల్లో లెక్కించారు. మొత్తం 14 రోజుల్లో వైఎస్సార్‌సీపీ 12, టీడీపీ 2 వార్డులు గెలుచుకుంది. 1,2,3,4,6,7,8,9,10,12,13,15 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

5,11 వార్డుల్లో టీడీపీ గెలిచింది. పోటాపోటీ వాతావరణంలో.. కుప్పం ఫలితం అధికార పార్టీ వైసీపీనే వరించింది.చంద్రబాబు కంచు కోట కావడంతో.. ఇక్కడ గెలిచి మీసం మెలేయాలని వైసీపీ వ్యుహం పన్నింది.మొత్తానికి వారి ఆశ నెర‌వేరింది.