మిరాకిల్..పుట్టిన బిడ్డ కడుపులో కవల శిశువులు…!
Samsthi 2210 - August 16, 2021 / 04:43 PM IST

వైద్య శాస్త్రంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతుంటాయి. కొన్ని సంఘటనలు చూసి డాక్టర్సే ముక్కున వేలేసుకుంటారు. అసలు అలా ఎలా జరిగిందో కూడా తెలియక బిత్తర పోతుంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటన వైద్య శాస్త్రం కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. సాధారణంగా ఓ మహిళ ఒకరు లేదా ఇద్దరు ఒక్కోసారి ముగ్గురు నలుగురు పిల్లలకు కూడా జన్మనివ్వడం సహజం.
కాని పుట్టిన బిడ్డ కడుపులో మరో శిశువు దాగి ఉన్నాడని తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. అసలు అలా ఎలా సాధ్యం అని చాలా మంది నోరెళ్లపెడుతుంటారు. కాని అది మెడికల్ మిరాకిల్ అంటున్నారు. ఇజ్రాయిల్ లోని ఓ మహిళ గర్భంగో ఉండగా, ఆమె ప్రతి మూడు నెలలకొకసరి చెకప్‌కు వెళ్లింది. అయితే ఓ సారి కడుపులో ఉన్న బిడ్డ పొట్టభాగం కాస్త ఎత్తుగా కనిపించింది. కారణం ఏంటన్నది పూర్తిగా గుర్తించలేకపోయారు. డెలివరీ అయ్యాక చూడాలని డిసైడ్ అయ్యారు.
మహిళ డెలివరీ నాటికి బిడ్డ కడుపు మరింత ఎత్తుగా కనిపించింది. ప్రసవం పూర్తయ్యాక అమ్మాయి పుట్టిందని తెలిసింది.అయితే ఆ చిన్నారి పొట్టభాగం చాలా ఎత్తుగా కనిపిస్తుండే సరికి బేబికి స్కాన్ చేశారు. రిపోర్ట్ చూశాక వైద్యుల మైండ్ బ్లాక్ అయింది. బిడ్డ కడుపులో రెండు పిండాలు ఉన్నట్టు వారు గుర్తించారు.
ఈ సంఘటన వైద్యులని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వారు ఆపరేషన్ చేసి రెండు పిండాలను తొలగించి, చిన్నారిని అబ్జర్వేషన్లో ఉంచారు. ప్రస్తుతానికి సమస్య ఏమీ లేదని , ఇలాంటి కేసులు దాదాపు 5 లక్షల మందికి ఒకరిలో కనిపిస్తాయని చెప్పారు. కవల పిండాలు ఏర్పడినప్పుడు ఒకదానిలోకి మరొకటి వెళ్లిపోయే అవకాశం ఉంటుందని ఈ కేసులో కూడా అలాగే జరిగి ఉంటుందని భావిస్తున్నారు.