Aus Vs Ban: ఆసీస్‌ను వ‌ణికించిన బంగ్లా.. 23 ప‌రుగుల తేడాతో విజ‌యం

Aus Vs Ban: ఒక‌ప్పుడు బంగ్లాదేశ్‌ని అన్ని దేశాలు ప‌సికూన‌లుగా చూశాయి. కాని ఇప్పుడు ప‌రిస్థితి వేరేలా ఉంది. బెబ్బులిలా విజృంభిస్తున్నారు. ఎలాంటి పెద్ద టీం అయిన స‌రే వారికి త‌గ్గ పోటీ ఇవ్వ‌డ‌మే కాకుండా ఒక్కో సారి సంచల‌న విజ‌యాలు సాధిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ 20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీం 23 ప‌రుగుల తేడాతో గెలిచి అంద‌రిని ఆశ్చర్య‌ప‌ర‌చింది.

Aus Vs Ban Bangladesh Won T20 Match Against Australia
Aus Vs Ban Bangladesh Won T20 Match Against Australia

ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్ నయీం రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ మూడు ఫోర్లతో 36 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ మహ్మదుల్లా (20), అఫిఫ్ హుస్సేన్ (23) తమవంతు పాత్ర పోషించడంతో బంగ్లా స్కోరు 131 పరుగులకు చేరింది. ప్రత్యర్థి బౌలర్లలో హాజిల్‌వుడ్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టారు.

132 పరుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా .. బంగ్లా బౌలింగ్‌కు కుదేలైంది.ఎక్క‌డా కూడా కోలుకోలేక‌పోయింది. మిచెల్‌ మార్ష్‌ (45; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేయగా మిగతా వారంతా మూకుమ్మడిగా చేతులెత్తేశారు. బంగ్లాదేశ్‌ బౌలర్‌ నసుమ్‌ అహ్మద్‌ 4 వికెట్లు పడగొట్టగా… ముస్తఫిజుర్‌ రహ్మాన్, ఇస్లామ్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియాపై మంచి విజ‌యం సాధించిన బంగ్లాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.