Wedding Ceremony : వివాహ వేడుకలో అవయవదానం.! ఐడియా కొత్తగుంది గురూ.!
NQ Staff - December 27, 2022 / 01:59 PM IST

Wedding Ceremony : ఈ రోజుల్లో వివాహ వేడుకంటే.. బోల్డంత హంగామా.! నవ దంపతులకు బంధు మిత్రులు ఇచ్చే కానుకల దగ్గర్నుంచి, బంధు మిత్రులకు వధూవరుల తరఫున ఇచ్చే కానుకల వరకూ.. అన్నీ ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. పెళ్ళి వేడుకని రెండు మూడు రోజులు.. అంతకు మించి ఎక్కువ రోజులు చేసేందుకూ మొగ్గు చూపుతున్న రోజులివి.
అయితే, తమ వివాహ వేడుకని మరింత ప్రత్యేకంగా మలచాలని ఓ జంట సిద్ధమైంది. ఈ క్రమంలో ఎవరూ చేయని ఆలోచన చేసింది. అదే అవయవదానం.!
60 మంది అవయవదానం చేస్తారట..

As Many 60 People Declare Their Readiness For Organ Donation At Wedding Ceremony
ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 60 మంది అవయవదానానికి తాము సిద్ధమని ప్రకటించేలా.. వారిని నూతన వధూవరులు ఒప్పించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మసీమంలోని వేలివెన్ను గ్రామానికి చెందిన సతీష్ కుమార్ అనే యువకుడు ఈ గొప్ప ఆలోచన చేశాడు.
విశాఖలోని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి ఈ నెల 29న నిడదవోలులో జరిగే వివాహ వేడుకకి హాజరై సంబంధిత పత్రాలను స్వీకరిస్తారు.
అయితే, ఇవి అవయవదానానికి సంబంధించి హామీ పత్రాలు మాత్రమే. ప్రమాదాల్లో గాయపడి బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి అవయవాల్ని సేకరించి, అవసరమైనవారికి అమర్చుతారు.