Anand mahindra: ఐర‌న్ మ్యాన్ క‌ల నెర‌వేర్చిన ఆనంద్ మ‌హాంద్రా.. ఫిదా అవుతున్న నెటిజ‌న్స్

Anand mahindra: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా మ‌ట్టిలోని మాణిక్యాల‌ను గుర్తించి వారి ప్ర‌తిభ‌ను ప్రపంచానికి ప‌రిచ‌యం చేస్తుంటారు. ప్ర‌తిభావంతుల గురించి ఆయ‌న నిత్యం ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తుంటారు. కాగా, కొన్ని రోజుల క్రితం మ‌ణిపూర్ కు చెందిన ప్రేమ్ అనే యువ‌కుడు చెత్త వ్య‌ర్థ ప‌దార్థాల‌తో ఐర‌న్ మ్యాన్‌ను త‌యారు చేశాడు.

TheNewsQube-
anand mahindra helps to iron man1
anand mahindra helps to iron man1

ప్రేమ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్ చదివేందుకు తోడ్పాటునందించారు. హైదరాబాద్‌లోని మహీంద్రా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పించారు. ఈ విషయాన్ని ఆనంద్‌ మహీంద్రా స్వయంగా ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. అలాగే ప్రేమ్‌ ప్రయాణానికి సహకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు

మ‌ణిపూర్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ స‌హ‌క‌రించింది. ఈ క్రమంలో ప్రేమ్ ప్ర‌యాణానికి స‌హ‌క‌రించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ కు ఆనంద్ మ‌హీంద్రా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

ప్రేమ్‌ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి ఐరన్‌ మ్యాన్‌ సూట్‌ నమూనాను తయారు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి శిక్షణ లేకుండా వాటిని రూపొందించాడు. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదవాలనుకుంటున్నానంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు.

anand mahindra helps to iron man2
anand mahindra helps to iron man2

ఇది కాస్తా ఆనంద్‌ మహీంద్రా దృష్టిలో పడడంతో.. ప్రేమ్‌ కల నెరవేరినట్లైంది. ప్రేమ్‌ తోబుట్టువులకు కూడా సాయం చేస్తామని ఆనంద్‌ మాటిచ్చారు.